Others

అఘాసురుడ్నీ హతమార్చాడు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. కాని రాక్షసులకు వైరభావం పెరుగుతూనే ఉంది. అఘాసురుడను రాక్షసుడు కృష్ణుడి గురించి తెలుసుకొన్నాడు. ఎలాగైనా తన సోదరుని చంపిన కృష్ణుని సంగతి తేల్చాలని అనుకొన్నాడు.
ఒకసారి, కృష్ణుడు, గోపాలురు అందరూ కలసి వనవిహారానికి వెళ్లినట్లు గోవులను తీసుకొని వెళ్లి వాటిని రోజంతా మేపుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు. వారికి దారిలో ఒక పెద్ద కొండచిలువ నోరు తెరుచుకొని పడుకుని ఉండడం కనిపించింది. దాన్ని వారంతా చూశారు. వారికి ఎక్కడాలేని నవ్వు వచ్చింది.
వారంతా పకపకా నవ్వుతూ ఒరేయి మన దగ్గర కృష్ణుడు ఉన్నాడు కదా. నిన్నమొన్ననే కదా బకాసురుని మట్టు పెట్టాడు. ఎంతమంది రాక్షసులు కృష్ణుని దగ్గరకు వచ్చినా వారంతా యముని దగ్గరకు వెళ్లుతూనే ఉన్నారు కదా. ఈ కొండ చిలువకు ఆ విషయం తెలిసినట్లు లేదు. పెద్ద పెద్ద రాక్షసులే తోక ముడిచి పారిపోతుంటే కదలలేని ఈ కొండచిలువ తానే మహా గొప్ప అన్నట్టు దారికడ్డంగా పడుకొంది. మనం మన దారి వెంట వెళ్దాం. అది మనలను ఏమీ చేయలేదు అనుకొన్నారు.
వారిలో కొంతమంది అరే ఈ కొండ చిలువ నోరు ఆకాశమంత ఉన్నట్టు ఉంది. ఎందుకైనా మంచిది. మనం వేరే దారి చూసుకొందామా అనుకొన్నాయి. మళ్లీ అట్లా అన్నవాళ్లే ఏమీ అక్కర్లేదు. మనతో కృష్ణుడు ఉన్నంత వరకూ మనలను ఎవరూ ఏమీ చేయలేరు. ఒకవేళ బ్రహ్మే దిగి వచ్చినా అతడూ మనలను ఏమీ చేయలేడు. పదండి ముందుకు పదండి. ఒకవేళ ఇది పిచ్చి వేషాలు వేసిందా మన వెనుక ఉన్న కృష్ణుడు దీని ఊపిరి తీసేస్తాడు. సరి పోతుంది. బిక్కచచ్చి చస్తుంది. మనలను ఏం మన్నా చేయాలని చూసిందా దాని పని సరి ధైర్యంగా అడుగులు వేయండి సుమా అంటూ ముందుకు పోతున్నారు.
మరలా ‘‘ఓ కృష్ణా ! ఇదిగో చూడు ఇక్కడ చూడు ఇక్కడొక కొండ చిలువ నోరు తెరుచుకుని మన దారికి అడ్డుగా ఉంది. ఇక్కడే నీవు ఉన్నావని దీనికి తెలియనట్లు ఉంది. మేమే అనుకుని మమ్మల్ను భయపెడదామని అనుకొంటున్నట్టు ఉంది. నీవు మా వెనుకనే ఉన్నావని దీనికి చెప్పు.’’ అంటూనే ముందుకు పోతున్న గోపాలురును కొండచిలువ రూపంలో బకాసురుని తమ్ముడు అఘాసురుడు మరింత పెద్దగా నోరు తెరిచి వారినందరినీ మింగివేయాలనుకొని ముందుకు జరిగాడు. వెనుకనంచి చూస్తున్న కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అయ్యో నేనున్నాననుకొంటూ వీరు ఆ రాక్షసుని నోటిలోనికి వెళ్లుతున్నారే... ఇపుడు వీరంతా ఇంటికి వెళ్లకపోతే వీరి అమ్మలంతా ఏమై పోతారు. వీరిని నేను రక్షించి తీరాల్సిందే కదా.. అమ్మో అనుకొంటూ తాను కూడా గబగబా అడుగులు వేస్తూకొండచిలువ నోటిలోకి అడుగు పెట్టాడుఅప్పటిదాకా మన్ను తిన్న పాములాగా పడుకుని ఉన్న అఘాసురుడు ‘ఇపుడు నా పని సులువు అవుతుంది. కృష్ణుడే తనంతట తాను వస్తున్నాడు. నా అన్నను చంపడం ఇతనికి సులభం అయింది. కాని నేను కంసుడు పంపగా వచ్చాను. పైగా నా అంత బలవంతులు, నేర్పరులు ఎవరూ లేరు. ఇపుడు చూడు తెలివి వీరిని అంతా ఒక్కఉదుటన మింగివేస్తాను. అపుడు కృష్ణుడు ఈ అర్భకులు అందరినీ గుటుక్కుమనిపిస్తాను. అనుకొంటూ మరింత నోరు తెరిచాడు. కొండచిలువ నోటిలోకి అడుగుపెట్టిన కృష్ణుడు గొంతు దగ్గర నిలబడిపోయాడు. తన శరీరాన్ని కూడా అమితంగా పెంచసాగాడు. కొండ చిలువ నోరు గొంతు ఎంత పెద్దదిగా ఉందో అంత పెద్దదిగా తన శరీరమూ పెంచేసాడు. కొండ చిలువ కృష్ణుడిని మింగలేక కక్కలేకపోయింది. అందరికీ ఊపిరి ఆడకుండా చేస్తానన్న కొండ చిలువ తనకే ఊపిరి అందక కొట్టుమిట్టాడింది. ఆ కొండ చిలువ కడుపులోని వాయువులన్నీ సంచరించే వీలు లేక విపరీతమైన వత్తిడితో కొండ చిలువ శరీరాన్ని పగులగొట్టుకొని బయటకు రావడానికి సిద్ధవౌతున్నాయి. కాని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతూ నిలబడే ఉన్నాడు. కొండ చిలువకు అర్థమైంది. తాను కృష్ణుడిని చిక్కించుకోవడం కాదు. ఆయన్ను తాను మింగడం కాదు. ఆయనే తన్ను మింగివేశాడని. కృష్ణతత్వం అర్థమైంది. తాను మింగాననుకొన్న గోపాలురను ఒక్కసారి చూసింది. వారంతా కృష్ణుని వీరత్వాని కథలుగా చెప్పుకుంటూ నవ్వుతున్నారు. తాను ఎంత అధముడో కొండచిలువకు అర్థమైంది. అంతలో అఘాసురుని లోపల వాయువులన్నీ ఒక్కసారిగా తలనుంచి వివిధ భాగాలల్లో ఉన్న శరీరాన్ని పగులగొట్టుకొంటూ బయటకు వచ్చేశాయి. అంతే కొండచిలువ నేలకూలింది. కళ్లు తేల్చింది. వాయువులతో పాటు వచ్చిన గోపాలురు చచ్చిన కొండ చిలువను చూసి బాగయ్యింది. మాకే అడ్డువస్తావా.. మేమేమంటే ఎవరనుకొన్నాము. మాకు కృష్ణుడికి తేడా ఉందా. మమ్ము ఇబ్బంది పెడితే మా కృష్ణయ్య చూస్తూ ఊరుకొంటాడా. ‘‘ దా కృష్ణా ! ఇంటికి వెళ్దాం. మన అమ్మలంతా ఇంకా రాలేదేమీ అంటూ మనకోసం ఎదురుచూస్తుంటారు. నీ వీరత్వాన్ని ఈ కొండ చిలువ అఘాయిత్యాన్ని వారికి చెప్దాం దాదా అంటూ కృష్ణుడి చుట్టూ చేరి కొండ చిలువ దురహంకారాన్ని తిడుతూ కృష్ణుని మెచ్చుకుంటూ ముందుకు వెళ్లుతున్నారు. వాళ్లందరినీ చూసి బ్రహ్మాది దేవతలు పుష్పవృష్టికురిపించారు. ఆహా ఈ గోపాలుర అదృష్టమే అదృష్టం. పరమాత్మ వీరికి ఏమాత్రం భేదం లేదు సుమా అనుకొన్నారు. రంభాదులు ఆనందంతో నృత్యం చేస్తున్నారు.
* * *

- చరణ శ్రీ