Others

విజ్ఞానంతో అద్భుత ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలలో అసంబద్ధముగా కనపడే విషయాలు నవీన విజ్ఞానం పెరిగిన తర్వాత అద్భుత శాస్ర్తియ విజ్ఞాన అవతారాలు అవుతున్నాయి.
తర్కశాస్తమ్రును ఎక్కువగా విస్తరింపచేసినవారు దిజ్నాగాచార్యులవారు మొ. గువారు. వారికి బుద్ధిరాక్షసులు అని పేరు. మన కుర్ర శంకర భగవత్పాదులవారు వేదాలు మాత్రమే ప్రమాణముగా చూపి అందరి నోళ్ళు మూయించేను కాని బౌద్ధుల విషయములో వేదాలు చెల్లవు. అందుకని ఆయన చూపిన అతిలోక ప్రజ్ఞాపాటవాల వలన వాదన పటిమ ముందర బౌద్ధము మన దేశములో సంపూర్ణముగా వ్యాపించియుండినను ఆయన తర్వాత మన దేశములోనే లేకుండ పోయినవి. అది శంకరులవారు ప్రదర్శించిన అద్భుత వాదనా పటిమ.
బౌద్ధులు పంచభూతలు లేవందురు. వాయువు, అగ్ని, నీరు, భూమి అని నాల్గు మాత్రమే భూతములున్నవి. ఆకాశము పంచమ భూతము కాదు. ఈ నాల్గు భూతములు లేకపోవుటయే ఆకాశము అని బౌద్ధుల వాదము. కాని వేదములో తస్మాద్వా ఏతస్వాదాత్మన ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయురగ్నిః అగ్నేరాపః అద్భః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో న్నమ్ అన్నాత్పురుషః అని క్రమమున్నది.
అనగా శూన్యమువలె కనపడే జ్ఞానఘనమైన ఆత్మనుండి (ఆత్మ ఒకటే పరమాత్మ జీవాత్మ అను భేదములు లేవు) ఆకాశము పుట్టినది. తక్కిన అర్థము సుగమము. ఆకాశమనగా వేదముల ప్రకారము అభావ పదార్థము కాదు. అది అ= అంతట కాశతే ఇతి ఆకాశః = ప్రకాశించున్నది అని భావ పదార్థముగా వేదాలు వర్ణించెను. అందువలన అట్లు అభావ పదార్థముగా కనపడి వేదములో భావపదార్థముగా వర్ణింపబడిన ఆకాశ భూతము ప్రస్తుతపు నవీన విజ్ఞానము పెరిగిన తర్వాత యథార్థమైనది.ఇప్పుడు అనంత విశ్వమంతయు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వేవ్స్ (విద్యుత్ ఆయస్కాంత తరంగములు) చాల దట్టముగా వ్యాపించియున్నవి. ఇప్పుడు ఇతర నక్షత్ర మండలములకు కూడ రాకెట్లు అను వాచకములు పోవుచున్నవి. ఈ విద్యుత్ ఆయస్కాంత తరంగములు దట్టముగా ఉండుటచేతనే వాటినుండి మనకు సంకేతములు అందుచున్నవి. మనము వాటితో మాటలాడుచున్నాము. ఇది ప్రత్యక్షముగా శాస్తజ్ఞ్రులకందరికి అనుభవములో ఉన్న విషయమే. భూలోకములో కూడ మనము ఏ మూలన ఉన్నను సెల్‌ఫోన్లలో మాట్లాడుటకును ఆ మాటలు వినబడుటకును వేదములలో శబ్దగుణకమైనది ఆకాశము అని చెప్పబడిన ఆకాశమే ప్రత్యక్షముగా సహాయము చేయుచున్నది. ఆకాశము భావపదార్థము కనుక దానికి సహజమైన ఒక గుణమున్నది. అదియే శబ్దము (్ధ్వని) ఆకాశములో పుట్టినది వాయువు.
దానికి సహజగుణము స్పర్శ. తన తండ్రియైన ఆకాశముయొక్క గుణమైన శబ్దము కూడ తనలో ఉన్నది. వాయువునుండి అగ్ని ఈ అగ్నిలో అగ్నియొక్క సొంత గుణము కనులకు కనపడుట (వాయువు, ఆకాశములు కనపడవు= రూపం) తన తండ్రి గుణమైన వాయువులోని స్పర్శకూడ అగ్నిలో ఉన్నది. తన పితామహుని గుణమైన ఆకాశము యొక్క ధ్వని ఆ అగ్నిలో ఉన్నది. అగ్నే రాపః అగ్నినుండి నీరు పుట్టినది. ఈ నీటిలో తన సొంత గుణమైన రుచి ఉన్నది. దీనిలో తన తండ్రి గుణమైన అగ్నివలె కనపడు రూపమున్నది. పితామహుడైన వాయువువలె స్పర్శ ఉన్నది. ప్రపితామహుడైన ఆకాశముయొక్క ధ్వని కూడ నీటిలో ఉన్నది.
అద్భ్యః పృథివీ నీటినుండి భూమి పుట్టినది. ఈ భూమిలో తన సొంత గుణమైన వాసన ఉన్నది. తన తండ్రియైన నీటి యొక్క రుచి అనుగుణమున్నది. తన పితామహుడైన అగ్నియొక్క కనపడుట అను రూపమున్నది. తన ప్రపితామహుడైన వాయువుయొక్క స్పర్శ అను గుణమున్నది. తన ప్రపితామహుని తండ్రియైన ఆకాశము యొక్క ధ్వని అను గుణమున్నది. ఇట్లు పంచభూతములయందు గుణ పంచకము వెలసి ప్రపంచము కొనసాగుచున్నదని వేదములు చెప్పినవి అన్ని విధములుగా నిరూపితములైనవి.

- బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ