Others

స్కూళ్లలో తల్లిదండ్రుల పూజకో రోజు! ( వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి గవర్నమెంటు స్కూల్స్‌లో ఏడాదికోరోజు తల్లినీ తండ్రినీ పూజ చేసే రోజుగా కేటాయిస్తూ విద్యా శాఖమాత్యురాలు శ్రీమతి నీరాయాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో నలభై వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. దీనిని ‘మాత్రి పిత్రి దివస్’ అంటారు. మొత్తం యాభై లక్షలమంది విద్యార్థులు ఇక ఏటా పేరెంట్స్ డే చేసుకుంటారు. ఆమాటకొస్తే, పక్కనున్న చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో 2015లోనే వాలైంటైన్స్ డేని ఎత్తేసి ‘అమ్మా నాన్నల పూజ రోజు’ అంటూ అమలు చేస్తున్నారు. ఐతే అది చూసి కాదు మన రాష్ట్రంలోనే గిరంధి జిల్లాలోని లోక్ నాయక్ ఎయిడెడ్ స్కూలులో పిల్లలందరూ మొన్న ఇరవై తేదీనాడు తల్లికి తండ్రికీ పూలదండలు వేసి హారతి ఇచ్చి పాదాలకు దండం పెట్టడం సభ చూశానని- అదే స్ఫూర్తితో మన రాష్ట్రం అంతటా కూడా మాత్రి పిత్రి దివస్ పెడుతున్నామని, తేదీ త్వరలో ప్రకటిస్తామని నీరాజీ చెప్పారు. ఐడియా బాగుంది, ఇంగ్లీషు మదర్స్ డే ఎత్తేసి ఇది పెడితే సరి- నాన్న కూడా మురిసిపోతాడు!

-వీరాజీ