AADIVAVRAM - Others

సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెలియ సింగారి ముగ్గుల చీరగట్ట
ఇంటి యల్లుడు ‘గొబ్బెమ్మ’ వంటయింట!
దాసు డెజమాని గన! ‘హరిదాసు’డవ్వ?
‘గంగిరెద్దులె’ ‘పిల్లలు’ గడపలోపు

ఉత్తరాయణ కిరణాల కొత్తదనము
మంచుగురియగ! సుమముల యంచులన్ని

వజ్ర వైఢూర్యమట్లుగ వనె్నగూర్చ!
పిండివంటల మంటలే మండుచుండ!

క్రొత్తయల్లుళ్ల కోర్కెలు కూర్పులందు
అత్తమామల చిత్తాన హాయిగాగ!
కంటిపాపల వెలుగులు నంటుకోగ
భోగి, సంక్రాంతి ఇళ్లలోసాగుటేగ!

క్రొత్త సంక్రాంతి కోర్కెల సొత్తుబంచ
రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె
యింట బయటను పండుగ కంటబడగ
ఈశుడైనను మెచ్చు ప్రయాసగనగ!

-కె.ఈశ్వరప్ప 9885336485