Others

ఎప్పటికీ పద్మశ్రీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకులలో పి.పుల్లయ్య పద్ధతి ఇతర దర్శకులకంటే భిన్నం. తన చిత్రాల షూటింగులు, రికార్డింగులు మినహా ఇతరత్రా ఎలాంటి సినిమాకు సంబంధించిన కార్యక్రమాలలోగాని ఇతరత్రా వ్యవహారాలలో గాని అసలు జోక్యం చేసుకోరు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అగ్ర హీరోలతో చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించారు. సావిత్రి, జెమినీ గణేశన్ జంటకు మొదటిసారిగా దర్శకత్వం వహిస్తూ చిత్రం నిర్మించింది పుల్లయ్య కావటం విశేషం (మనం పోలమాంగల్యం). సినిమా రంగంలోగల ప్రతిభావంతులైన నటీనటులను దర్శక నిర్మాతలను పద్మ అవార్డుల ఎంపికలో మన ప్రభుత్వాలు పట్టించుకోలేదనే విమర్శ అనాదిగా వుంది. పి.పుల్లయ్యకు పద్మశ్రీ అవార్డు లభించకపోయినా అందరూ పద్మశ్రీ పుల్లయ్య అని సంబోధిస్తూ వుంటారు. కారణం ఆయన నిర్మాణ సంస్థపేరు పద్మశ్రీ పిక్చర్స్. ప్రభుత్వ గుర్తింపుకంటే పరిశ్రమ గుర్తింపు బాగుంది కదూ!
తన శిష్యుడు మొదటిసారిగా దర్శకత్వం వహించిన ‘తీర్పు’ వినోదపుపన్ను రద్దుచేయబడిన తొలి చిత్రం కావడంతో ఏర్పాటైన అభినందన సభకు ప్రత్యేకంగా హాజరై ప్రసంగిస్తున్న దర్శకులు పి.పుల్లయ్య. యు.విశే్వశ్వరరావునూ ఈ చిత్రంలో చూడవచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717