Others

అమ్మా... ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ప్రేమలో పడిన మాట నిజమే -అంటూ కుండబద్దలు కొట్టిన సమంతను చూసి ఫ్యాన్స్ బీపీ ఫీలవుతున్నారు. గతంలోనూ ఆమె కాస్త తొందరపడి ‘నేనేం ఒంటరిగా లేను’ అన్న డైలాగ్ ఓపెన్ చేసింది. అయితే -తరువాత ఆమె చేసిన ట్వీట్లు చూసి పెట్ డాగ్‌తోనో, డెయిలీ జిమ్‌తోనో సమంత లవ్‌లో పడిందని సరిపెట్టేసుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో డైలాగ్ ఓపెన్ చేయడంతో -మళ్లీ ఇదే హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా సమంత -తానో యువ హీరోతో లవ్‌లో ఉన్నానని సెనే్సషన్ క్రియేట్ చేసింది. తన ప్రేమికుడిలో ఉన్న మంచి గుణాలే తనను ఆ రూట్‌లోకి తీసుకెళ్లాయనీ చెబుతోంది. తనను పూర్తిగా అర్థంచేసుకున్నాడనీ, చాలా ఏళ్లుగా తెలిసిన వ్యక్తి కావడంతో ఇద్దరి మధ్యా ఎలాంటి అరమరికలూ ఉండవన్న నమ్మకం కలుగుతోందని మైకు గుద్ది మరీ చెబుతోంది. అతను వంట బాగా చేస్తాడట, అతను వండిపెడితే తినడానికి సిగ్గుపడుతోందట. అందుకే పోటీగా వంట కూడా నేర్చుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. పెళ్లి తరువాతా సినిమాల్లో చేయడానికి సమ్మతించాడని ప్రియుడి కబుర్లు మీడియాకు విప్పింది. అతనెవరో చెప్పొచ్చుగా అంటే -గతంలో ఆ తప్పు చేసే ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అందుకే సీక్రెట్‌గా ఉంచుతున్నట్టు చెప్పి బ్రేక్ వేస్తోంది. మొత్తానికి తాను ఏం చెప్పదలచుకుందో అదే తప్ప, ఒక్క క్లూ కూడా ఇవ్వడం లేదు సమ్మూ బేబీ. పేరు చెప్పకుండా ఆశ.. దోశ అంటూ ఊరిస్తోందని శామ్స్ ఫ్యాన్స్ తెగ ఆవేదన పడుతున్నారు.