AADIVAVRAM - Others

మేడారం ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా మేడారంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరను చెబుతారు. దాదాపు రెండు కోట్ల మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారని అంచనా. ఐదు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. జాతర నాలుగు రోజులే జరిగినా అంతకుముందు నుంచే జనం అడవులమీదుగా మేడారం చేరుకుంటారు.
* ఈ జాతరకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని చెబుతున్నా ఆధారాలు లేవు. అయితే విశ్వాసాలు, నమ్మకాలే ఈ జాతరకు వనె్నచినె్నలు తెస్తోంది. 1940 వరకు కేవలం చిలుకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే ఈ జాతర ఆ తరువాత విస్తృతమైంది. కేవలం గిరిజనులేకాకుండా సకలజనులు హాజరవడం మొదలైంది. 1975వరకు ఇది ప్రజలే జరుపుకునేవారు. రానురాను రాజకీయ వత్తిడులు పెరిగి ప్రభుత్వ జోక్యం, సౌకర్యాల ఏర్పాట్లు మొదలయ్యాయి. 1996లో అప్పటి వరంగల్ జిల్లా యంత్రాంగం సూచన మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇక ఆ తరువాత రాష్ట్ర పండుగగా గుర్తింపు కోసం గళం విప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక 2016లో తొలిసారిగా జాతర అద్భుతంగా నిర్వహించారు. పెద్దఎత్తున నిధులు వెచ్చించి వౌలిక సౌకర్యాలు కల్పించారు.
* ఒకప్పుడు దట్టమైన మేడారం అడవుల్లోకి వెళ్లడం సాధ్యమయ్యేది కాదు. వందల మైళ్ల దూరం నుంచి భక్తులు రోజుల తరబడి సరిపోయే విధంగా సరుకులు, సరంజామా అమర్చుకొని ఎడ్లబళ్లపై మేడారం వెళ్లేవారు. మైళ్లబారున ఎడ్లబండ్ల వరుసలు అప్పటి గిరిజన జాతరకు అసలైన అందం. అధునాతన రవాణా సౌకర్యాలు, రహదారి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ఎడ్లబళ్లపై వచ్చేవారి సంఖ్య ఎక్కువే.
* ఎర్రమట్టితో నిండిన మేడారంలో ఈ నాలుగు రోజులూ దుమ్ముధూళి ఆకాశాన్ని కమ్మేస్తాయి. ఎర్రటి ధూళి, మట్టి రేగి చుట్టుపక్కల ఉన్న చెట్లు, బస్సులు, బళ్లు, వాహనాలపై చేరి అన్నీ ఎర్రబారిపోతాయి. అంత పెద్దఎత్తున మట్టి రేగిందంటే జనం ఏ స్థాయిలో వస్తారో అర్థమవుతుంది.
* కేవలం గిరిజనులకే కాదు సమ్మక్క,సారమ్మ తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్యులు. మేడారం జాతరకు నిండు గర్భిణులు హాజరవడం అతి సాధారణం. జాతరలో ప్రసవించి ఆ వనదేవతల పేర్లను తమ పిల్లలకు పెట్టుకోవడం ఓ విశ్వాసం.. ఓ సంప్రదాయం.
* నాలుగు రోజుల పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఉండటానికి ఎన్ని సౌకర్యాలున్నా సరిపోవు. వసతి పెద్ద సమస్య లక్షల్లో వచ్చే జనానికి ఏ సౌకర్యాలు సరిపోతాయి. నాలుగు గుంజలు పాతి, కాస్త గడ్డి కప్పి మంచు నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన గుడారాలు అద్దెకు ఇచ్చేవారు. ఇది నాలుగైదు దశాబ్దాలనాటి మాట. ఇప్పుడు కాస్తంత అధునాత సౌకర్యాలతో ఇవి ముస్తాబవుతున్నాయి.
* వనదేవతలు ‘బంగారం’ సమర్పించడం ఆనవాయితీ. మొక్కులు తీర్చడమూ ఆ ‘బంగారం’తోనే. ఇక్కడ బంగారం అంటే బెల్లం. కోళ్లను గాల్లోకి ఎగరేయడం, బలి ఇవ్వడం, శివసత్తుల పూనకాలు, జంపన్నవాగులో పవిత్ర స్నానాలు జాతరలోని కొన్ని ఆసక్తికర సన్నివేశాలు.