AADIVAVRAM - Others

గుట్ట క్షేత్రం.. శివలింగాలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముడు కొలిచిన దేవుడు- శ్రీరామలింగేశ్వరుడు కొలువుదీరిన కీసరగుట్ట ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ నగరానికి ముప్పైకిలోమీటర్ల దూరంలో ఉన్న కీసరగుట్ట శ్రీరాలింగేశ్వరస్వామి ఆలయం అటవీ, కొండ ప్రాం తాల్లో ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువై ఉంది. స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం కీసరగుట్టకు సీతా సమేతుడై విచ్చేశాడు. ఇక్కడి ప్రకృతికి మంత్రముగ్ధుడైన శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్టించదలచి హన్మంతుడిని కాశీకి వెళ్లి శివలింగాన్ని తీసుకురావల్సిందిగా ఆదేశించాడు. కాశీకి వెళ్లిన హన్మంతుడు ఎంతకీ రాకపోవటంతో, మహర్షులు నిర్ణయించిన ముహుర్తము సమీపిస్తుండటంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని శ్రీరాముడు సీతాదేవితో కలిసి ప్రతిష్ఠించి పూజలు చేశాడు. అందువల్ల శ్రీరామలింగేశ్వరునిగా ఆలయానికి ఈ పేరు వచ్చింది. శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత హన్మంతుడు 101 శివలింగాలను తీసుకొని కీసరగుట్టకు చేరుకున్నాడు. అప్పటికే శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించడంతో, కోపోద్రిక్తుడైన హన్మంతుడు తాను తీసుకు వచ్చిన శివలింగాలు ఎందుకూ పనికిరాలేదని మొత్తం 101 శివలింగాలను విసిరిపారేసాడు. విసిరి పడేసిన శివలింగాలు గుట్ట పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ నేటికీ భక్తులకు దర్శనమిస్తున్నాయి. హన్మంతుని కోపాన్ని తగ్గించేందుకు శ్రీరామచంద్రుడు హన్మంతుడు తెచ్చిన శివలింగాల్లో ఒకదానిని శ్రీరామలింగేశ్వరస్వామి అలయానికి వామ భాగాన ప్రతిష్ఠించాడు. అదే ఇప్పుడు కాశీవిశే్వశ్వర ఆలయంగా పిలువబడుతున్నది.
పర్యాటక ప్రదేశాలు.. కీసరగుట్టలో ఆలయంతో పాటు చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పురావస్తుశాఖ తవ్వకాల్లో యజ్ఞకుండములు, మట్టిపాత్రలు, నాణాలు బయటపడ్డాయి. వీటిని గుట్ట కింద ఏర్పాటు చేసిన మ్యూజియంలో చూడవచ్చు. 17 వశతాబ్ధంలో అక్కన మాదన్నలు హరిహర క్షేత్రంగా చేయదలచి, శివాలయం పక్కనే శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించారు. శిధిలావస్థలో ఉన్న ఈఆలయాన్ని మాజీ ఎంపీడీఓ పసుమర్తి శ్రీనివాస్‌రావు పునరుద్ధరించి, అందులో రామాలయం, శ్రీశివపంచాయతనం, శ్రీ్భవానీ, శివదుర్గ అమ్మరార్లు, గణపతి విగ్రహాలను ప్రతిష్టించారు. రామలింగేశ్వరస్వామి దర్శనం అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయా న్ని భక్తులు సందర్శిస్తారు. గుట్ట దిగువ భాగాన గల తామరకొలను, స్వామివారి పాదాలు, సీతమ్మగుహ, అక్కన్న మాదన్నలు నిర్మించిన స్వాగత ద్వారాలు, మూడు బావులు, మారుతీ కాశీవిశే్వశ్వరాలయం అనువిందు చేస్తాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలను అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాం నుండి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన వలస తమిళులు శివరాత్రి వారంరోజుల పాటు గుట్టపైనే ఉండి స్వామిసారి సేవలో తరిస్తారు.

చిత్రాలు..కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి

-అవిరేణి ఆదినారాయణ