AADIVAVRAM - Others

ఏకశిలపై కొలువైన ఉమామహేశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రమల కొండల సానువుల్లో శ్రీఉమామహేశ్వరులు ఏకశిలపై వెలసిన దివ్యక్షేత్రం యాగంటి. ఇది కర్నూలు జిల్లా బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూ రంలో ఉంది. అగస్త్య మహర్షి దక్షిణాది పర్యటనలో భాగంగా ఉమామహేశ్వర శిలాఫలకం ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. వాస్తవానికి ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో తొలుత స్వామివారి విగ్రహాన్ని సిద్ధం చేశారు. అయితే ప్రతిష్ఠా సమయంలో యాదృచ్ఛికంగా స్వామి విగ్రహం కుడికాలి బొటనవేలు భిన్నమైంది. దీంతో ప్రతిష్ఠకు అనర్హం కావడంతో ఆదిదంపతులు ఏకశిలపై స్వయంభువుగా వెలసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. భిన్నమైన వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని విష్ణుగవిలో నిలిపారు. ప్రతిష్ఠా సమయంలో పవిత్ర జలం కోసం అగస్త్యుడు తవ్విన నీటి ఊట నేటికి అగస్త్య పుష్కరిణి (చిన్న కోనేరు)గా పిలువబడుతోంది. కొండకింది అంచుల నుండి నీటి ఊట నిరంతరంగా వస్తుంది. ఇక్కడి నుండి నీరు ఆలయం ముందు భాగంలో ఉన్న పెద్దకోనేరుకు చేరుతుంది.
యాగంటిలో అంతకంతకూ పెరుగుతున్న బసవన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. ఈ క్షేత్రంలో అందుకు భిన్నంగా నంది ఎదురుగా కాకుండా పక్కకు జరిగి ఉన్న తీరు అబ్బురపరుస్తుంది. ఈ క్షేత్రంలో శివపార్వతులు ఏకశిలపై వెలసినందున వారి ఏకాంతం కోరుతూ బసవన్న పక్కకు జరిగి ఉన్నాడని ప్రతీతి. ‘యాగంటి బసవన్న అంతకంతకూ పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా’ అని అలనాడు పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా బసవన్న అంతకంతకు పెరుగుతుండడం విశేషం. యాగంటిలో ప్రకృతి సహజంగా వెలసిన మూడు గుహలు వున్నాయి. వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర గుహలుగా పిలుస్తారు. బ్రహ్మంగారు గరిమిరెడ్డి అచ్చమాంబ దంపతులకు ఇక్కడి గుహల్లో కాలజ్ఞాన బోధ చేశారని ప్రతీతి. కర్నూలు, తాడిపత్రి, నంద్యాల నుంచి బనగానపల్లె మీదుగా యాగంటికి చేరుకోవచ్చు.

-శర్మ - వెంకటశివయ్య