AADIVAVRAM - Others

ప్రేమికుల రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి నెల వచ్చిందంటే యువకుల్లో ఓ కొత్త అలజడి మొదలవుతుంది.
‘వాలెంటైన్స్ డే’ ప్రభావం అది.
ఆ రోజుకి ప్రత్యేకతని సృష్టించారో, నిజంగానే ప్రత్యేకత వుందో నాకైతే తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుని ప్రేమికుల రోజుగా పరిగణిస్తున్నారు.
మంచిదే!
కనీసం ఆ రోజున యువకులకే కాదు పెద్దవాళ్లకు కూడా తమ సహచరి పట్ల, సహచరుడి పట్ల ప్రేమని వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది.
రోజూ తమ ప్రేమని వ్యక్తీకరించని వ్యక్తులు ఆ రోజు తమ ప్రేమని వ్యక్తీకరించుకోవచ్చు.
కార్డుల ద్వారా, పువ్వుల ద్వారా, కానుకల ద్వారా చాలామంది తమ ప్రేమని వ్యక్తీకరిస్తూ వుంటారు. ప్రేమని ఎలా వ్యక్తం చేసినా ఫర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం- ప్రేమని వ్యక్తం చేయడం.
ప్రేమికుల రోజుని దృష్టిలో వుంచుకొని ప్రేమని ఇతరుల్లో పురికొల్పాలని ప్రేమమయ వాతావరణం నెలకొనే విధంగా ప్రయత్నం చేయాలి. భయాన్ని ఇతరుల్లో కలిగించడం చాలా సులువు. భయాన్ని పురికొల్పిన వాళ్లం ప్రేమని ఇతరుల్లో పురికొల్పలేమా?
ఈ ప్రపంచం ఇతరుల్లోని మంచిని త్వరగా గుర్తించదు. అందరి వైపు వేలుని చూపిస్తుంది.
ఇతరుల్లో వున్న మం చిని మనం చూడలేమా?
మన విభేదాలని మర్చిపోయి, దగ్గర కాలేమా?
ఒకరికి ఒకరం సహాయం చేసుకునే దిశగా మనం ప్రయాణం చేయలేమా?
కోపం వదిలేసి నవ్వులను పంచలేమా?
ప్రేమని పురికొల్పలేమా?
ప్రేమికుల దినం రోజు నుంచి... ఆ ప్రయత్నం చేద్దామా?

- జింబో 94404 83001