Others

చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువత చదువుకుంటున్నప్పుడు సీరియస్ గా చదువుకున్నా ఒక్కసారి ఉద్యోగం రాగానే ఏదో సాధించేశామని అనుకొంటున్నారు. ఇక అంతా ఎంజాయ్ చేయడానికే రోజులు అనే అపోహతో ఉంటున్నారు. వీక్‌ఎండ్ పార్టీలంటూ దూరంగా వెళ్తున్నారు. వారంరోజులు ఇంట్లో ఉన్నవారితో కనీసం మాట్లాడకుండా గడిపే రోజులు కూడా ఉంటున్నాయ. అదిదూరంగా ఆఫీసులు ఉండడమో లేక,పని వత్తిడి ఉండడమో లాంటివి చేయడంతో ఇంట్లో మిగతావారితో కలసి మెలసి ఉండే సమయం చాలా తక్కువగా ఉంటోంది. ఈ శనిఆదివారాలు రాగానే ఎక్కడో వెళ్లి ఎంజాయ్ చేయాలనే దృక్ఫదం అటు ఇంట్లో వాళ్లకు నీరసాన్ని తెస్తుంది ఇటు పార్టీల పేరిట తాగి తందనాలు ఆడుతూ లేకపోతే పబ్స్‌లో ఉంటూ నలుగురిలో నవ్వుల పాలు అవుతూ వారికే వారు మచ్చ తెచ్చుకుంటున్నారు.
ఒక్కసారి ఆలోచించండి ఇది మంచి పద్దతేనా? ఇంకో విషయం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగానికన్నా ఎంజాయ్ చెయ్యడంపైనే శ్రద్ధ కాని, డిస్కోలు, అర్ధరాత్రి పార్టీలు, గాసిప్‌లు, ఫ్యాషన్‌లపై వున్న శ్రద్ధ ఉద్యోగంపైన అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడంపైన చూపడంలేదు. పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతైన సంస్కృతి వేస్తున్న మాయాగాలానికి బలహీనమనస్సున్న వారు బలైపోతున్నారు.
ఇటువంటివారే సంక్షోభ సమయాల్లో కంపెనీలు ఉద్వాసన పలికే ఉద్యోగుల జాబితాలో వుంటున్నారు. ఉద్యోగం చేసినవాళ్లు ఎటువంటి పొదుపు చేయకపోవడంవలన ఉద్యోగం లేనపుడు ఎక్కువ కష్టనష్టాలకు గురవుతున్నారు.
జీవితంలో అతి ముఖ్యమైన దశల్లో ఉద్యోగ జీవితం ఒకటి. ఇక్కడ మనం ఎంత అద్భుతంగా రాణిస్తే మన మిగతా జీవితం అంత అద్భుతంగా గడిచిపోతుంది. ఉద్యోగం మనకి సంపాదన ఇచ్చే వనరు మాత్రమే కాదు మనలో వున్న కార్యసాధకునికి పదునుపెట్టి మనకి మాటల్లో చెప్పలేని ఉద్యోగ సంతృప్తిని ఇచ్చేది కూడా. మార్పు నిత్యకృత్యమైన నేటి ఆధునిక యుగంలో అదనపు నైపుణ్యాలు తప్పనిసరి.
కనుక మనం ముందు మన ఆరోగ్యం, ఇంట్లో వారి సంగతి, రాబోయే రోజుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003