Others

ఆత్మీయ ఆలింగనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైతే నేమి
ఆ రుధిరాన్ని కోసేసి..
ప్రాణాన్ని మింగడమే
నా వృత్తి...
ముఖారవిందంలోని
రెండు నల్లటి నయన పక్షులు
విశ్వవిహారం చేసి వీక్షించిననేమి
వాటి రెక్కలు తుంచి
ఖగోళంలో విసిరేయడమే
నా లక్ష్యం....
శబ్దాలతో ప్రతిధ్వనించిన
ఆ కుహరములను
నిశ్శబ్ద మట్టికి అతికించడమే
నా కర్తవ్యం...
మనసులను చుంబించిన
జతఎర్రటి పెదవుల శిఖరాలను
జాబిల్లిలో ఇమిడ్చాను
వెనె్నల పాలతో
విశ్వాభిషేకం చేస్తుందిలే
దేహమంతా కిరణాలను
పూసుకున్న ఆ శ్రీదేవిని
నేడు భూదేవిలోకి
జారవిడుస్తున్న
ఎందుకంటే
భూదేవి అందవిహీనవౌతోంది
ఆ శరీరం నుండి కాసిన్ని కిరణాలను
పూసుకుంటుందట
తాను గుర్తొస్తే
మీ మనోనేత్రాలతో భూమిని
ఆత్మీయ ఆలింగనం చేసుకోండి

-అఖిలాశ 7259511956