Others

పాపాకర్షణ వద్దనే వద్దు (అనగనగా.)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కియాన్ బల్ల మీది మోడల్ విమానం ఆఖరి భాగాన్ని దానికి నిర్దేశించిన ప్రదేశంలో ఉంచాడు. తర్వాత దాన్ని చేత్తో పట్టుకుని గాల్లోకి విసిరేసాడు. కాగితంతో చేసిన అది కొంత దూరం పైకి ఎగిరాక రెక్కలు అల్లాడిస్తూ కిందకి పడిపోయింది. వెంటనే కియాస్ దాన్ని కోపంగా అందుకుని గోడకేసి కొట్టాడు. తర్వాత ఏడవ సాగాడు.
ఆ ఏడుపు విని పక్క గదిలోంచి వాడి తండ్రి వచ్చి అడిగాడు.
‘‘ఏమైంది?’’
‘‘నా విమానం కూలిపోయింది’’.
ఆయన దాన్ని తన చేతిలోకి తీసుకుని చూసి నవ్వి అడిగాడు.
‘‘నిన్న నీకు చెప్పిన భూమ్యాకర్షణ శక్తి గురించి గుర్తుందా?’’
‘‘గుర్తుంది.’’
‘‘్భమ్యాకర్షణ శక్తి అన్నిటినీ వాటి స్థానాల్లో ఉంచుతుంది.’’
‘‘మరి విమానం ముందుకి నడిచేప్పుడు రెక్కల కింది వత్తిడి దాన్ని గాల్లోకి నెడుతుంది. విమానం ఎంత వేగంగా వెళ్తుంటే, పైకి తోయబడటం కూడ అంత వేగంగా జరుగుతుంది. కాగితంతో చేసిన ఈ విమానంలో ఇంధనం లేకపోవడంతో పైకి లేచాక పడిపోవడం సహజమే. నువ్వు భూమ్యాకర్షణ శక్తి పనిచేస్తోందని ఏడుస్తున్నావు తెలుసా?’’
కియాన్ కళ్లు తుడుచుకుని సిగ్గుగా అవునన్నట్లుగా తల ఊపాడు.
‘‘లేదా మనమంతా నేలమీద నిలబడలేం. ఇలాగే మనిషి ప్రవర్తన సాధారణంగా పాపాకర్షణలో చిక్కుకుని ఉంటుంది’’.
‘‘పాపాకర్షణ శక్తా?’’
‘‘అవును. మనకి ఏదైనా కావాలని అనుకుంటే పాపాకర్షణ అది తప్పైనా మనచేత చేయిస్తుంది. అలా మనం పోగుచేసుకునే పాపాన్ని రద్దు చేసే మరో శక్తి గురించి నీకు చెప్పానా?’’ ‘‘పాపాకర్షణని రద్దుచేసే శక్తా?’’ కియాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘అవును. అది దైవశక్తి. పాపాకర్షణ శక్తి కన్నా ఉన్నతమైంది దైవశక్తి. మనం దేవుడ్ని నమ్మి భక్తిగా కొలిస్తే మనం చేసిన పాపాలు పడిపోవడమేకాక పాపాకర్షణ శక్తి నుంచి బయటకి వచ్చేస్తాం. అప్పుడు మనకి కావాలనుకున్నది పాపం అని తెలిస్తే దాన్ని పొందే ప్రయత్నం చేయం.’’
‘‘అర్థమైంది. మీరు వద్దని చెప్పే పనులు చేయకుండా ఉండాలంటే నేను దైవభక్తిని పెంచుకోవాలన్నమాట.’’ కియాన్ నవ్వుతూ అడిగాడు.
‘‘అవును. మేము వద్దని వారించేది పాపమని నీకు అర్థమైందా?’’ కియాన్ తండ్రి నవ్వుతూ అడిగాడు.
‘‘ఐంది. పాలమీది మీగడని మీకు తెలీకుండా తినడం, హోంవర్క్ చేయకుండా కూడా చేసాననడం లాంటిదే కదా?’’
అవును. నువ్వు చేసేది పాపమో కాదో తెలుసు కోడానికి ఓ తేలిక మార్గం ఉంది’’
‘‘ఏమిటది?’’
‘‘ఏ పని చేస్తుంటే నీకు భయం వేస్తుందో, ఎవరికైనా అది తెలిస్తే నీకు సిగ్గుగా ఉంటుందో, ఏది రహస్యంగా చేస్తావో అవన్నీ పాపపు పనులే అని అర్థం’’ కియాన్ తండ్రి వివరించాడు.
‘‘సరే. ఇక మీదట నేను అలాంటివి చేయను. అందుకు దైవభక్తిని పెంచుకుని పాపాకర్షణ లోంచి బయట పడతాను’’ కియాన్ దృఢంగా చెప్పాడు.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

మల్లాది వేంకట కృష్ణమూర్తి