Others

ఆనంద హోలీ రంగులకేళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద హోళి
శివపూజకు
వేళాయంటూ
పూసిన గోగుపూల
అరుణకాంతులు
వెండి వెనె్నల
జాబిలి వెలుగులలో
అడవంతా
తళుకులీనగ
శిశిర
శీతలములుగ
లేలేత చిగురు
దారాలాలతో అల్లిన
ఆకుపచ్చని చీరకట్టి
తేమతుషార
బిందురూపమై
పంచవనె్నల
రామచిలుకలా
కనువిందు చేస్తున్న
ప్రకృతి కాంత...
నునువెచ్చని
ఉషాకిరణాలు
ఏటవాలుగ
సప్తవర్ణాలు
విరజిమ్మాయి
వసంతోత్సవాన
జనజీవనము
ముఖచిత్రము
కాన్వాసుపై
రంగుల
అద్దకపు కలంకారీ
సరికొత్త ఆకృతి
హోళిర హోళీ
చమకేళీర హోళి
కేరింతల సందడి
తీగల అల్లికల
చెలిమి
పెదవి పూదటలో
విరబూసిన
నవ్వులు
గాలి అలలుగాసాగి
రంగుల కెరటాలై
వెదజల్లగ
సీతాకోకచిలుకల
సోయగం
ఆనందహేళి
ఆనందహోళి

- మడిపల్లి హరిహరనాథ్ 9603577655