Others

మొలకలతో.. ఆరోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలంలో చిన్న పెద్దాతేడాల్లేకుండా బరువు పెరిగిపోతున్నారు. ఆ బరువు వల్ల ఎన్నో సమస్యలు తలెత్తున్నాయి. గుండెజబ్బులు, రక్తహీనత వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని నియంత్రించాలంటే ఇంట్లో చక్కని పరిష్కారం ఉందంటారు వైద్యనిపుణులు. అతి ఎక్కడైనా పనికిరాదు అని తెలసిందేకదా. అతివేపుళ్లు, అతికారాలు, అతి ఉప్పులు ఏవైనా అనర్థానే్న తెచ్చి పెడుతాయి.
అందుకే అటువంటివేమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మొలకెత్తిన గింజలు తినాలి. శనగలు, పెసలు, కందులు ల్లాంటివి మొలకలెత్తించి వాటిని పొద్దున ఉపాహారంగా తీసుకొంటే ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది. ఇంకా రుచిగా ఉండాలంటే దీనిలో తురిమిన క్యారెటు, క్యాప్సికమ్ కరివేపాకు కొత్తిమీర, పచ్చి టమాటా ముక్కలు, దానిమ్మ గింజలు కూడా కలుపుకుంటే చూడడానికి, తినడానికి చాలా బాగుంటాయ. ఇంకా కావాలంటే దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకుంటే మరింత బాగుంటుంది. మొలకెత్తిన గింజలు తినడం వల్ల వచ్చే లాభాలు -
జీర్ణక్రియను మెరుగుపడుతుంది. ఎంజైముల పనితీరు బాగుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల అతి స్థూల కాయం ఉన్నవారు బరువు తగ్గుతారు. రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. దానివల్ల రక్తహీనత నశిస్తుంది. దీనివల్ల రక్తపోటు నియమితంగా ఉంటుంది. పిల్లల్లో తరచూ కనిపించే న్యూరల్ ట్యూబ్స్ సమస్యలు దూరమవుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ మొలకెత్తిన గింజల నుంచి అత్యధిక శాతంలో విటమిన్స్, ఖనిజాలు శరీరానికి లభిస్తాయి. విటిమిన్ సి, ఎ రిబోప్లేవిన్ వంటివెన్నో లభిస్తాయి. మాంగనీసు, జింక్, కాపర్, మెగ్నిషియమ్, ఐరన్, కాల్షియం వంటి మినిరల్స్ లభ్యమవుతాయి. గుండెజబ్బులు తగ్గుముఖం పడుతాయి. ఎలర్జీ లాంటి చర్మవ్యాధులు కూడా ఇవి తినడం వల్ల దూరమవుతాయి. ఇలా ఎన్నో లాభాలు ఈమొలకెత్తిన గింజలు తినడం వల్ల వస్తాయి. ముందురోజు బాగా మొలకెత్తించాల్సిన గింజలు నానబెట్టి వాటిని ఒక వస్త్రంలో మూటకట్టి దానిపై బరువు ఉంచితే చక్కగా మరుసటి రోజుకు మొలకలు వస్తాయి. ఇవి తినడానికి మంచి రుచిగా కూడా ఉంటాయి కనుక పిల్లలకు, పెద్దలకు ఇవి తినడానికి ఇష్టపడతారు.
*