Others

నువ్వులూ... ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వులు తెల్లవి, నల్లవి ఉన్నట్టుగా శుభానికి, అశుభానికి కూడా వాడుతుంటారు. ఇలా రెండు విషయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉన్న నువ్వులు విటమిన్స్‌లో ను ప్రాధాన్యతను కలిగిఉన్నాయ. నువ్వులలో కాల్షియం, ఐరన్, ప్రొటీన్స్ లభిస్తాయి. నువ్వులనుంచి నూనెను తీస్తారు. ఈ నూనెను వంటనూనెగా ఉపయోగిస్తారు. ఈ నూనెతో దీపారాధన చేయడమన్నది ఎంతో శ్రేష్ఠం. ఈ నూనెను వాడటంవల్ల దేహంలో కొలెస్టరాల్ శాతం పెరగదు. నువ్వుల నూనెను తలకు బాగా పట్టించి, అభ్యంగన స్నానం చేసినట్లయితే, శిరోజాల ఆరోగ్యం బాగుండటమే కాక, వెంట్రుకల కుదుళ్ళు దృఢంగా తయారవుతాయి. వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతుంది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేసినట్లయితే దేహం దృఢంగా తయారవుతుంది. కండరాలు, ఎముకలు పటిష్టమవుతాయి. చర్మానికి మృదుత్వం, నిగారింపు వస్తాయి. ఊరగాయలకు నువ్వుల నూనె వాడుతారు. నువ్వులు వైద్యపరంగా కూడా ఉపయోగిస్తారు. తీపి, కారం పిండివంటలలో నువ్వులను ఉపయోగిస్తారు.
నువ్వులు వాతాన్ని హరిస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
నువ్వులను మెత్తగా పొడిచేసి, ఆ పొడికి రెట్టింపు చక్కెరనుకలిపి మాత్రలా చేసి, మజ్జిగలో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గిపోతాయి.
లేత మారేడు కాయల గుజ్జులో నువ్వుల పిండిని కలిపి, మజ్జిగ తేటతో కలిపి త్రాగిస్తే డయేరియాకు నివారణ కలుగుతుంది.
గింజలేని ద్రాక్ష పళ్లు, నువ్వులు కలిపి తింటే వికారం, వాంతులు నివారించబడతాయి.
నువ్వులు శరీరంలో వేడిని కలుగజేస్తాయి.
శరీరానికి నీరు పట్టినవారు నువ్వులను తింటే, నీరు క్రమేణా తగ్గుతుంది.
*