Others

చూతము రండీ గోదాకల్యాణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసంలో గోదాదేవి వ్రాసి పాడిన పాశురాలను అనుసంధానించుకొంటూ నెలరోజులు వైష్ణవాలయాలన్నీ శోభాయమానంగా ఉంటాయి. తాను ధరించి ఇచ్చిన పూమాలలనే కావాలని కోరుకుని ధరించిన శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడిని తన భక్తుడిగా ప్రకటించి తన కూతురు చేసిన పనికి నీవేమీ ప్రాయశ్చిత్తం చేసుకోనక్కర్లేదు కాని నేను నీవు పెంచి పోషించిన అయోనిజను నాకోసమే ఎదురుచూసే ఆ ఆండాళ్‌ను నేను పాణిగ్రహణం చేస్తానని మాటిచ్చాడు. ఆ రంగనాథుని మాట విని పులకించిన మదితో తన అమ్మణ్ణి తీసుకుని శ్రీరంగని సమీపానికి వెళ్లగా ఆ స్వామి విగ్రహంనుంచి చిరునవ్వుతో ప్రకాశించి తన చేతిని చాచాడట. అంతే ఆ స్వామిని కనులారా చూస్తూ చూస్తూ స్వామి దగ్గరకు వెళ్లి వెళ్లి చివరకు ఆ స్వామిలోనే ఐక్యమైపోయింది ఆ ఆండాళ్ తల్లి. ఈ కలియుగంలోను అట్లా స్వామి కైంకర్యము చేస్తూ తన జీవితాలను కూడా స్వామికే అంకితం చేయాలని తలుస్తూ భోగి పండుగ నాడు భూదేవి అరుగుగాను, ఆకాశం పైకప్పుగాను నిలువగా అష్టైశ్వర్య సంపదకు నెలవైన శ్రీనివాసుని కృపతో ఆండాళ్ అమ్మను సర్వాంగసుందరంగా అలంకరించి అలంకార ప్రియుడైన శ్రీరంగని బహుసుందరంగా అలంకరించి వారిరువురికి సంప్రదాయ బద్ధంగా వివాహం జరిపిస్తారు. పెళ్లికాని కన్యలందరూ ఈ గోదాదేవి కల్యాణంలో పాల్గొంటే వారికి మంచి భర్త లభిస్తాడని ఐతిహ్యం. సంతానహీనులు సైతం శ్రీరంగనాథ ఆండాళ్లల దయతో సత్‌స్సంతానాన్ని పొందుతారని పురాణకథనం. అత్యంతమనోహరమైన వీరి వివాహమహోత్సవాన్ని చూచితీరవలసిందే.