Others

సంపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదన అవసరమే. అయితే, ఇది ఎంతమేరన్నదానిపై ఎవ్వరూ దృష్టి పెట్టడంలేదు. పక్కవారు ఏదో కొన్నారని మనకు అవసరమున్నా లేకపోయనా అది మన పరిధిలో ఉన్నాలేకపోయనా కొందరు కొనేస్తుంటారు. అదీ వాయదాల పద్ధతిమీద. ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పులేదు. పక్కవాని గోల మనకేల? వానికి అవసరమైనది వాడు కొనుక్కొంటాడు. మనకు అవసరమైనది మనకు తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎందుకు ఉండడం లేదు. అదేపనిగా టీవీ సీరియల్స్ చూడడం, అదే పనిగా వాటిని అనుకరించడం చేస్తే ఒకనాటికి మనలో ఉన్న సృజనాత్మకత దూరమై పోతుంది. అనుకరణే ఉండిపోతుంది. దేనికైనా కాస్త నిబద్ధత పరిధి ఉండాలి. అపుడే అది నాణ్యంగా తయారవుతుంది. అక్కడ చూపించేవి ఏదో ఫ్రీగా ఇస్తున్నారన్నవి కూడా కొనాలనుకొనేవాళ్లు తయారు అవుతున్నారు. వస్తువులు అమ్ముకునే వారి వ్యాపారంలోని నేర్పరితనమది అట్లా చూపి ఇట్లా లాక్కుంటారు వాళ్లు. వూరికినే ఎవరు ఎందుకు ఇస్తారు. మనం ఇస్తామా అని ఆలోచించండి. లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు కదా వరదతో పోతున్నా ఏదో ఒక లాభం ఉంటుంది. అందుకే ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం అంటారు. మీరే కాస్త నిదానం చూసి అవసరమా? వీళ్లు చెప్పే ది ఎంతవరకు నిజం అని ఆలోచించి మరీ ఖర్చు చేయండి.