Others

రణభేరి (ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనవీరునిగా రాజశేఖరునిగా కాంతారావు పాత్రోచితమైన భావోద్వేగాలను నటనలో చూపి మెప్పించారు. సంకెళ్లతో చేతులు బంధింపబడగా, చిరునవ్వుతో ఉరిశిక్షకై వెళుతూ, ప్రజల అభినందనలు స్వీకరించటం, అటు దుర్గతో చెల్లెలిగా అభిమానం, నందినితో ప్రణయం, తల్లివంటి మహారాణిని కలిసినపుడు మాతృమూర్త్భివన ఎంతో సహజంగా చూపారు.
మచిలీపట్నంకు చెందిన పింజల సుబ్బారావు, 1957లో మద్రాసు వచ్చారు. కొన్ని చిత్రాల్లో నటించటం, ఆపైన ‘‘రామాంజనేయ యుద్ధం’’, ‘‘సతీసుకన్య’’ చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. తరువాత వేస్ట్ ఫిలిం కొని, అమ్మటం వ్యాపారం చేసారు. సినీ నిర్మాణం పట్ల అభిరుచితో ఓ తమిళ చిత్రాన్ని కొని ‘‘రాజద్రోహి’’ పేరిట డబ్బింగ్ చేశారు. 1966లో స్ట్రెయిట్ చిత్రంగా ‘‘హంతకులొస్తున్నారు జాగ్రత్త’’ నిర్మించారు. 1968లో గిడుతూరి సూర్యం దర్శకత్వంలో వీరు రూపొందించిన జానపద చిత్రం ‘‘రణభేరి’’. బ్యానర్ పి.యస్.ఆర్ పిక్చర్స్‌పై విడుదల 9-02-1968
కమ్యూనిజం, సాహిత్యం, లలిత కళల పట్ల అభిరుచిగల వ్యక్తి గిడుతూరి సూర్యం. రష్యా దేశం వెళ్లి అక్కడ ఎక్కువ కాలం గడిపారు. రష్యా భాషను అభ్యసించి, ప్రోగ్రెసివ్ పబ్లికేషన్స్‌లో పనిచేసి, రష్యన్ భాషలోని అనేక పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే రష్యాలోని వివిధ నాట్యరీతుల గురించి పరిశోధన చేశారు. విశాల భావాలుగల వీరు తొలుత ‘‘సంగీతలక్ష్మి’’, ఆ తరువాత 1968 ‘‘రణభేరి’’ ఇంకా ‘‘కథానాయకురాలు’’, ‘‘పేదరాశి పెద్దమ్మ’’, ‘‘విక్రమార్క విజయం’’, ‘‘పంజరంలో పసిపాప’’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు,
‘రణభేరి’ చిత్రానికి కథ- బొమ్మకంటి సుబ్బారావు, మాటలు- టి.పి.మహారథి, నృత్యం- కె.ఎస్.రెడ్డి, సంగీతం- ఎస్.పి. కోదండపాణి, స్టంట్స్- మాధవన్, కళ- కుదరవల్లి నాగేశ్వరరావు, కెమెరా- హెచ్‌ఎస్ వేణు, కూర్పు- కె.యస్.ఆర్. దాసు, నిర్మాత- పింజల సుబ్బారావు, దర్శకత్వం- గిడుతూరి సూర్యం.
చిత్ర కథ:
కంఠాన రాజ్య ప్రభువు గుణశేఖరుడు (ప్రభాకర్‌రెడ్డి) పెద్ద భార్య సర్వమంగళాదేవి (నిర్మల) ఆమెకు ఇద్దరు కుమారులు రాజశేఖరుడు, చంద్రశేఖరుడు. చిన్నభార్య మాధురీదేవి (మోహన). ఆమెకొక కుమారుడు. వేటకు వెళుతూ మహారాజు, సర్వమంగళను, కుమారులిద్దరినీ తీసుకువెళతాడు. అక్కడ రాజశేఖరుడు పాముకాటుకు గురై తప్పిపోతాడు. అతని కోసం వెతుకుతూ వెళ్లిన మహారాణి పిచ్చిదానిగా మారుతుంది. భార్య జాడ తెలియని మహారాజు రాజ్యం చేరి, చంద్రశేఖరుని భారం చిన్నరాణి కప్పగిస్తాడు. పాముకాటుకు గురైన రాజశేఖరుని ధర్మయ్య కాపాడి తన కూతురు దుర్గతో సమంగా, వనవీరుడి (కాంతారావు)గా పెంచుతాడు. యువరాజు చంద్రశేఖరుడు (రామకృష్ణ) అవంతి రాకుమారి దేవసేన (గీతాంజలి)ని ప్రేమిస్తాడు. గుణశేఖరుని వల్ల తమ తండ్రి మరణించాడని భావించే ఆమె తల్లి, అన్న ఈ ప్రేమకు అంగీకరించకపోయినా, చంద్రశేఖరుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. గుణశేఖరుని రాజ్యంలో మహామంత్రి, రాజగురువు (్ధళిపాళ) సేనాపతి రణజిత్తు (రాజనాల) అతని అనుచరులు ప్రజలను హింసించి, కొల్లగొట్టి ధనం సంపాదిస్తుంటారు. వనవీరుడు వీరిని ఎదిరిస్తుంటాడు. యువరాజుకు ఈ విషయాలు తెలియవు. అన్నగారి పేరిట మహాస్తూపం నిర్మించాలన్న భావనతో ప్రజల నుండి శ్రమశక్తిని, ధనా న్ని ఉపయోగించమని రణజిత్తుకు అనుజ్ఞ ఇస్తాడు. వనవీరుడు విప్లవ సైన్యాన్ని సిద్ధం చేసుకొని దుర్గ (వాణిశ్రీ) సాయంతో వారి యత్నాలు విఫలం చేస్తుంటాడు. రణజిత్తు పంపగా వచ్చిన, గూఢచారిణి నందిని (రాజశ్రీ) వనవీరుని మంచితనం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. దుర్గ తనకు వనవీరునికి మధ్య ఆమె అడ్డు వచ్చిందని కోపంతో రణజిత్తు వద్దకు వెళ్లి వనవీరుడి జాడచెప్పి బంధింపచేస్తుంది. రాజాజ్ఞచే వనవీరుని ఉరితీయబోతుండగా విప్లవ సైన్యంతో నందిని, పిచ్చికుదిరిన మహారాణి బయలుదేరి వెళ్లి ఉరిని తప్పించటం, చంద్రశేఖరునికి నిజం తెలియటం, ఓ మాంత్రికుడు నాగభూషణం తీర్చిదిద్దిన దుష్టశక్తిని సోదరులు అంతం చేయటం, దీనికి కుట్ర చేసింది చినబాబు (రాజబాబు) అని తెలియటం అతను మరణించడంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో ఇంకా బాలకృష్ణ, మీనాకుమారి, డా.రమేష్, జ్యోతిలక్ష్మి, పెమ్మసాని రామకృష్ణ, జూ.్భనుమతి, సాబూ అనే కుక్క నటించారు.
దర్శకులు గిడుతూరి సూర్యం సన్నివేశాలను ఎంతో విపులంగా అర్థవంతంగా చిత్రీకరించారు. రాజ్యంలో జరిగే అన్యాయాలు, సేనాపతి గుర్రానికి కోడిగుడ్ల సొనతో మాలీష్ చేయించటం, దాని ఆహారం గుగ్గిళ్ళు తిన్న పసివాడిని సైనికులు హింసించటం, హీరో దానిని ఎదిరించటం, హీరో అవంతిరాజ్యంలో ఖడ్గవిద్య నేర్చిన, ఆ యువరాజు ఉగ్రసింహుని దేవసేన స్వయంవర విషయంలో విభేదించటం. తాను నమ్మిన సామ్యవాద సిద్ధాంతాలను, రచయిత మహారధి తోడ్పాటుతో పదునైన మాటలుచే హీరో నోట మహాస్తూప నిర్మాణంలో, విప్లవ సైన్యంతో, చివర హీరోను బంధించి ఉరికి సిద్ధం చేసినపుడు పలికించటం, టైటిల్ సాంగ్ రణభేరి మ్రోగించాలి, కాగడాలతో, ఎంతో భావోద్వేగాలను చూపుతూ నిండుతనంతో సాగేలా (మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండిపోదాం) (రచన శ్రీశ్రీ, గానం ఘంటసాల బృందం) చిత్రీకరణ. అవంతి మహారాజు, ఇతరులు మాయం కావటానికి గుహలో ఒంటికన్ను మాంత్రికుడు, మరో మాంత్రికుడు నాగభూషణం చేసే వివిధ ప్రయోగాలు, ఆనందమోహన్ వికృత రూపునిగా ముళ్లకత్తులతో మారటం జానపద గాధల్లోలాగానూ, ఆకట్టుకునే విధంగా రూపొందించారు.
వనవీరునిగా రాజశేఖరునిగా కాంతారావు పాత్రోచితమైన భావోద్వేగాలను నటనలో చూపి మెప్పించారు. సంకెళ్లతో చేతులు బంధింపబడగా, చిరునవ్వుతో ఉరిశిక్షకై వెళుతూ, ప్రజల అభినందనలు స్వీకరించటం, అటు దుర్గతో చెల్లెలిగా అభిమానం, నందినితో ప్రణయం, తల్లివంటి మహారాణిని కలిసినపుడు మాతృమూర్త్భివన ఎంతో సహజంగా చూపారు. మొదట చెల్లెలి పాత్రకు ‘రాజశ్రీ’ని, ప్రేయసి పాత్రకు వాణిశ్రీని, నిర్మాత పింజల సుబ్బారావు అనుకున్నారట. దీనికి కాంతారావు తన పక్కన రాజశ్రీ, చెల్లెలిగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమో వాణిశ్రీ అయితేనే బాగుంటుందేమో అని సూచన చేశారుట. అదే విధంగా జరగటం వాణిశ్రీ దుర్గగా చిత్రం అంతటా ప్రధానంగా కన్పించటం, ఆ పాత్రను ఎంతో సులువుగా పోషించటం జరిగింది. నందినిని ప్రేమించాడన్న కోపంతో సేనాని వద్దకు చేరడం, అతని ముందు ‘‘చాలదోయి, చాలదోయి ఈ హారుూ’’ (రచన- ఆరుద్ర, గానం- ఎస్.జానకి) నృత్యం, చివర ఉరితీయటానికి గంట మ్రోగకుండా వేలాడి, క్రిందపడి మరణించటం, వివిధ షేడ్స్ వున్న పాత్రను మెప్పించటం విశేషం. ప్రేయసిగా గూఢచారిగా రాజశ్రీ దానికి తగ్గ అభినయం చూపారు. అన్నపై అభిమానంగల, వ్యక్తిత్వం గల చురుకైన రాకుమారునిగా రామకృష్ణ, అతని జోడీగా గీతాంజలి మెప్పించారు.
ఈ చిత్రంలో మహారథి మాట లు సన్నివేశానుగుణంగా మం చి మెరుపులు చూపించారు. జరుగుతున్న కాలానికి అన్వయించేలా, ప్రభుత్వ నిర్ణయాలను తెలియచెప్పటం విశేషం.
చిత్రంలోని ఇతర గీతాలు:
రామకృష్ణ, గీతాంజలిపై యుగళ గీతం ‘‘ఓ వలపు కౌగిళ్లలో కరగిపోయేవులే’’ (పి.బి.శ్రీనివాస్, పి.సుశీల- రచన దాశరథి) రాజ్‌బాబు, మీనాకుమారిలపై ‘‘నీకన్నా చక్కని చుక్కెవరే’’ (పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి- రచన కొసరాజు) రాజశ్రీపై చిత్రీకరించిన గీతం ‘‘ఇది కూడదురా, మదమెందుకురా మజా’ (పి.సుశీల రచన- కొసరాజు) కాంతారావు, రాజశ్రీల యుగళ గీతం చక్కని జలపాతాల మధ్య చిత్రీకరణ ‘‘వచ్చింది ఏమో చేయాలని’’ (పి.సుశీల, ఘంటసాల, రచన -సినారె) చిత్రం చివర కాంతారావు ప్రజలు, సైనికులపై అర్థవంతంగా చిత్రీకరించిన గీతం ‘‘ఇంతేలే వీరు గాధ, త్యాగుల గాధ’’ (ఘంటసాల, రచన-శ్రీశ్రీ) ‘రణభేరి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ చిత్రంలోని ‘మరో ప్రపంచం’ గీతం ఓ విప్లవ గీతంగా ఎన్నో ప్రశంసలు పొంది నేటికీ ఈ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. మిగిలిన గీతాలు కూడా అలరించేలా సాగటం, ఆ ట్యూన్స్ ఈనాటికీ ఎపుడు విన్నా, మనోరంజకంగా నిలవటం సంగీత దర్శకులు కోదండపాణి, గానగంధర్వుడు ఘంటసాలలను చిరస్మరణీయం చేస్తున్నాయి.

- ఎస్.వి రామారావు - సి.వి.ఆర్ మాణిక్యేశ్వరి