AADIVAVRAM - Others

అంతర్జాతీయంగా అగ్రస్థానంలో భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు విశ్వయోగి విశ్వంజీ ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు కేవలం మతప్రచారంలో ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. విశ్వంజీ మాత్రం మతం మనిషిని ఉన్నతస్థితికి తీసుకుపోయే ఒక మార్గమేనని, అది జీవన విధానమని అంటారు. 2018 మార్చి 5 న 74 వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న విశ్వంజీ ఆంధ్రభూమి ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న : మీరు ఏ అంశంపై ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు?
జవాబు: ఏదో ఒక అంశాన్ని ప్రచారం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. మనిషి ‘మనీషి’గా జీవించాలన్నదే నా ఉద్దేశం.
ప్ర: హిందూమతాన్ని విస్తృతం చేయాలనకుంటున్నారా?
జ: మత ప్రచారం చేయడం నా అభిమతం కాదు. మతం కన్నా మానవత్వమే ముఖ్యం. అందుకే అన్ని మతాలు సమానమే అని చాటి చెప్పేందుకే విశ్వనగర్‌లో విశ్వ సమగ్రతా స్థూపాన్ని నిర్మించాను. మతాలు మనం సృష్టించుకున్నవే. ఏ మతమైనా నీతి, న్యాయం, ధర్మం, సత్యసంధత కలిగి ఉండాలని బోధిస్తున్నాయి.
ప్రశ్న: మతకలహాల ఎందుకు వస్తుంటాయి?
జ. ఎవరైనా తమ మతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే కలహించాలనుకోరు. ఏ మతం వారైనా సరే తమ మత విశ్వాసాలను అనుసరిస్తూ, ఇతర మతాలను గౌరవించడమే మానతవ్వం అవుతుంది. ఏ మతం కూడా ఇతర మతాల పట్ల ద్వేషం కలిగి ఉండాలని, కలహించుకోవాలని చెప్పదు.
ప్ర: విశ్వశాంతి అంటుంటారు. ఇది సాధ్యమేనా
జ: విశ్వశాంతి అనేది బ్రహ్మపదార్థం కాదు. ప్రతి ఒక్కరూ, ప్రతి దేశం సామాజిక బాధ్యత కలిగి ఉంటే విశ్వశాంతి సులువుగా సాధించవచ్చు. ఒక వ్యక్తి శాంతిగా ఉంటే ఆ కుటుంబం శాంతిగా ఉంటుంది. ప్రతి కుటుంబం శాంతిగా ఉంటే ఆ గ్రామం, పట్టణం, నగరం శాంతిగా ఉంటుంది. అన్ని గ్రామాలు, పట్టణాలు శాంతిగా ఉంటే దేశం శాంతిగా ఉంటుంది. అన్నిదేశాలు శాంతిగా ఉంటే విశ్వశాంతి ఏర్పడుతుంది. ఇందుకు వ్యక్తిగతంగానూ, దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలి. పరస్పరం ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి.
ప్ర: నేటి సమాజానికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది కదా!
జ: ప్రపంచం నుండి ఉగ్రవాదం తొలిగిపోతుంది. కొంత మంది తప్పుడు ఆలోనచలను యువతలో రేకెత్తించడం వల్ల ఉగ్రవాదం, తీవ్రవాదం కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు కూడా సరైన బోధన ఉంటే వారు మంచిమార్గంలో నడుస్తారనడంలో సందేహం లేదు. త్వరలోనే ఉగ్రవాదం పూర్తిగా సమసిపోతుంది.
ప్ర: మీరు అమెరికాకే ఎక్కువగా వెళుతుంటారు? ఎందుకు?
జ: ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, భారత్ కీలకపాత్ర పోషించేస్థాయికి చేరాయి. దేహానికి భారత్ హృదయం లాంటిది అయితే అమెరికా మెదడులాంటిది. మిగతా దేశాలు శరీరానికి మిగతా అంగాలలాంటివి. హృదయం స్వచ్ఛమైన రక్తాన్ని మెదడుకు అందిస్తే, మెదడు సక్రమంగా పనిచేసి అన్ని అంగాలు బాగా ఉంటాయి. అలాగే భారత్ మంచి ఆలోచనలను అమెరికాకు అందిస్తే, దాని ద్వారా ప్రపంచానికి మంచిసంకేతాలు వెళ్లి విశ్వశాంతి ఏర్పడుతుంది. భగవత్ స్వరూపులు చేస్తున్న ప్రయత్నం కూడా సరిగ్గా ఇదే.
ప్ర: సత్ఫలితాలు వస్తాయా?
జ: తప్పకుండా వస్తాయి. విద్యుత్తును మీరు చూడలేరు కాని అనుభవించగలుగుతారు. ఇదీ అంతే..దివ్య పర్యటన ఫలితాలు విశ్వశాంతివైపు పయనిస్తూ ప్రపంచం మంచిని అనుభవిస్తుంది.
ప్ర: స్వర్ణదశాబ్ది అన్నారు కదా!
జ: అవును..2011 నుండి 2020 వ దశాబ్దిని ‘స్వర్ణశతాబ్ది’ అని 2011 జనవరి 1 న పేరుపెట్టాను. ఇప్పుడు భారతదేశం అత్యద్భుత ఫలితాలను ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచంలో ఏ దేశం ఆర్థికంగా, సామాజికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, భారత్ ఎలాంటి తొట్రుబాటు లేకుండా సజావుగా ముందుకు వెళుతోంది. శాస్త్ర, సాంకేతిక, ఆధ్యాత్మిక, రక్షణ, ఉత్పత్తుల రంగాల్లో వేగంగా ముందుకు దూసుకువెళుతోంది. అంతర్జాతీయంగా అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది భగవత్ సంకల్పం.
ప్ర: భారత్ అనేక అంతర్గతంగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తోంది కదా!
జ: ఏ దేశమైనా సమస్యలు లేకుండా ఉండదు. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సత్త్భారత్ పాలకులకు ఉంది. ఆర్థిక, సామాజిక, ఉగ్రవాద తదితర సమస్యలన్నీ అధిగమించి అన్ని విధాలా ఉత్తమమైన దేశంగా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తుంది.
ప్ర: జన్మదినోత్సవ సందర్భంగా మీరిచ్చే సందేశం?
జ: భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనిషి సార్థకం చేసుకోవాలి. ‘దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం’ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శరీరాన్ని మలినం కాకుండా శక్తివంతం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కల్మషం లేని, పరిశుద్దమైన మనస్సును కలిగి ఉండాలి. ఇనుప నరాలు, ఉక్కు కండరాలతో దృఢమైన శరీరంగా రూపొందించుకోవాలి. మనస్సును శక్తివంతం, జ్ఞానమయం చేసుకోవాలి. హృదయంలో ప్రేమ నింపుకుని, మనస్సును శాంతివనంగా రూపొందించాలి. అందరిపట్ల ఆప్యాయత, ఆత్మీయత కలిగి ప్రేమను అందివ్వాలి. నీతివంతమైన ప్రవర్తన అలవరచుకోవాలి. ప్రకృతివిరుద్దంగా ప్రవర్తించకూడదు.
ప్ర: ఐక్యత సాధ్యమవుతుందా?
జ: సాధన చేస్తే ఏదైనా సాధ్యమే అవుతుంది. ఐక్యతే మన బలం, మానవత్వం మన ప్రాణం అన్న విధంగా పనిచేయాలి. ప్రతివ్యక్తి చైతన్యం కలిగి, మేలుకుని, పృథ్వీమాతను కాపాడుకోవాలి.
ప్ర: యువత ఎలా ఉండాలి?
జ: సమాజంలో ప్రతి ఒక్కరూ తమపై తాము నమ్మకం ఏర్పరచుకుని, క్రమశిక్షణతో, స్వీయ నియంత్రణ, త్యాగం అలవాటు చేసుకోవాలి. చెడువైపు వెళ్లకుండా, మత్తుమందుకు బానిస కాకుండా, కుటుంబాన్ని అభివృద్దిలోకి తీసుకువస్తూ, తద్వారా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి.

-పి.వి. రమణారావు 98499 98093