AADIVAVRAM - Others

‘భరత’ కీర్తి-‘విశ్వ’ వ్యాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక అంశాల్లో భారతదేశానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. సనాతన ధర్మం కోసం పాటుపడే మహానుభావులకు భరతఖండం పుట్టినిల్లు. భగవంతుడు మనిషి రూపంలో జన్మించాలంటే ఈ పుణ్యభూమినే ఎంచుకుంటూ వస్తున్నాడు. రాముడు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, వేంకటేశ్వరస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉంటాయి. అలాగే ఒక వివేకానందుడు, రామకృష్ణుడు, రమణమహర్షి తదితరులంతా భగవత్ అంశతో జన్మించినవారే. ధర్మరక్షణకు అవసరమైన సమయంలో ఈ భువికి వస్తుంటానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు.
సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు, పృథ్వీమాతను కాపాడేందుకు అనేక మంది మహానుభావులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి మహానుభావుల్లో విశ్వయోగి విశ్వంజీ ఒకరు. సనాతనధర్మ రక్షణతో పాటు ప్రస్తుతం మనిషి మనుగడకు ఏర్పడుతున్న కాలుష్యం ముప్పు నుండి కాపాడేందుకు భగవాన్ శ్రీశ్రీశ్రీ విశ్వయోగి విశ్వంజీ (స్వామి) ప్రయత్తిస్తున్నారు. గుంటూరు సమీపంలోని ‘విశ్వనగర్’ కేంద్రంగా తన కార్యకలాపాలను (మిషన్) కొనసాగిస్తున్నారు. భారత్‌తో పాటు వివిధ దేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికాలో తరచూ స్వామి ‘దివ్యపర్యటన’ చేస్తున్నారు. లోకకళ్యాణం కోసం విశ్వనగర్‌లో తరచూ భగవంతుడిపేరుతో యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచాన్ని కబళించేందుకు సిద్ధంగా ఉన్న కాలుష్యం నుండి పృథ్వీమాతను కాపాడేందుకు ప్రయత్తిస్తున్నారు. పంచ భూతాల (్భమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలి) మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని స్వామి పదే పదే పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనిషి తన జీవనం కోసం పంచభూతాలను కలుషితం చేస్తున్నాడని, దాంతో వీటి మధ్య సమతుల్యత లోపించి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో మంచుతుపాన్లు, అగ్నివర్షాలు, మహాకుంభవృష్టి, వర్షాలు అసలే లేకపోవడం తదితర అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. మరోవైపు తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రపంచాన్ని వణికిస్తోంది. అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో సమూల మార్పులు రావల్సిన అవసరం ఉందంటూ స్వామి చెబుతున్నారు.
స్వామి ప్రారంభించిన ‘మిషన్’ సాధన కోసం అమెరికాలో ‘విశ్వయోగి విశ్వంజీ ఫౌండేషన్ ఫర్ యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్’ సంస్థ పనిచేస్తోంది. అలాగే భారత్‌లో విశ్వమానవ సమైక్యతా సంసత్ అనే సంస్థ నడుస్తోంది.
74 వ జన్మదినోత్సవం
గుంటూరు జిల్లా చముల్లమూడి గ్రామానికి చెందిన శ్రీమతి వరలక్ష్మి-గుర్రపడియ ఆంజనేయులు దంపతులకు 1944 మార్చి 5 న జన్మించిన బాలుడే నేటి విశ్వయోగి విశ్వంజీ. గుంటూరులో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆంజనేయులు తన శిష్యులతో బనారస్ వెళ్లారు. అదే సమయంలో, కాశీ విశే్వశ్వరుడి విగ్రహం నుండి కాంతిపుంజాలు వస్తున్నట్టు ఆంజనేయులుకు కల వచ్చింది. అదే సమయంలో ఆయన భార్య వరలక్ష్మమ్మ గుంటూరులో ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. కాశీ విశే్వశ్వరుడి దయవల్ల ఈ బాలుడు తనకు పుత్రుడుగా జన్మించాడని భావించిన ఆంజనేయులు ఈ బాలుడికి విశ్వనాథ శాస్ర్తీ అనే పేరు పెట్టారు. బిఎ (మ్యాథ్స్), బిఇడి వరకు చదివిన విశ్వనాథ శాస్ర్తీ ఉపాధ్యాయుడిగా గుంటూరులో పనిచేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నారు. 1965 లో శ్రీ దత్తాత్రేయ వాడేకర్ మహారాజ్ విశ్వనాథ శాస్ర్తీకి మంత్రోపదేశం చేశారు. రామకృష్ణ పరమహంస తన శక్తులను వివేకానందుడికి ధారపోసిన విధంగా దత్తాత్రేయ వాడేకర్ మహారాజ్ తన శక్తులను విశ్వనాథ శాస్ర్తీకి అందించారు. సమాజానికి పూర్తికాలం సేవలు అందించాలన్న ఉద్దేశంతో 1988 నవంబర్ 11 న విశ్వనాథ శాస్ర్తీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దత్తాత్రేయ తొమ్మిదో అవతారంగా విశ్వంజీకి పేరు వచ్చింది. అందుకే దత్తాత్రేయుడి అవతారాలను విశ్వంజీ తన ఆశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకు ‘ఓం శ్రీ సాయి రాం గురు దేవ దత్త’ అన్న మూల మంత్రాన్ని అందించారు. ప్రతి వ్యక్తిలో శక్తి దాగి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆత్మను విశ్వంతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. మంచి మనసుతో భగవంతుడితో బంధం పెంచుకోవడమే. సాధన చేస్తే ఇది ఎవరికైనా సాధ్యమేనని విశ్వంజీ చెబుతారు. సాత్వికాహారం తీసుకుంటూ, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు అతీతంగా ఉంటూ ప్రేమను మనస్సులో నింపుకుని, వాత్సల్యాన్ని హృదయంలో నింపుకుంటే అలాంటి వ్యిక్తిలో భగవంతుడిని చూడవచ్చని విశ్వంజీ పేర్కొంటున్నారు. 2018 మార్చి 5 న విశ్వంజీ 74 వ జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మార్చి 1 నుండి మార్చి 5 వరకు విశ్వనగర్‌లో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
విశ్వనగర్
విశ్వయోగి విశ్వంజీ ఏర్పాటు చేసిన ఆశ్రమం పేరే ‘విశ్వనగర్’. ప్రశాంతమైన వాతావరణంలో దాదాపు 80 ఎకరాల్లో దీన్ని
ఏర్పాటు చేశారు. గుంటూరు పట్టణం నుండి చిలకలూరిపేట వెళ్లేదారిలో (16 కిలోమీటర్ల తర్వాత) చినకొండ్రుపాడు గ్రామం వద్ద విశ్వనగర్‌ను ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఒకవైపు ‘విశ్వసమగ్రతా స్థూపం’ నిర్మించారు. దీని సమీపంలో ‘విశ్వగురుపీఠం’ (స్వామి నివసించే భవనం), మరోవైపు హోమశాల, దానిపక్కనే ఆడిటోరియం నిర్మించారు. ఒక భాగంలో భక్తులు నివసించేందుకు గదులు, భోజనశాలలు ఉన్నాయి. ఆశ్రమంలో ఒక వైపు ఆసుపత్రి (విశ్వయోగి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్-విమ్స్) నడుస్తోంది.
ఆశ్రమంలోకి వెళ్లే ప్రధాన గేటుకు అనసూయ ద్వారం అని పేరుపెట్టారు. మరో గేటుకు అత్రి ద్వారం అనే పేరుపెట్టారు. అనసూయ ద్వారం నుండి లోపలకు అడుగుపెట్టగానే రహదారి ఇరుపక్కల కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆశ్రమం మొత్తం హరితవనంలా కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన దారి చివరలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆశ్రమంలోకి వెళుతుండగా వినాయకుడి గుడి ఉంది.
విశ్వగురుపీఠం వెలుపల సరస్వతీ దేవీ విగ్రహం ఉంది. గురుపీఠంలో ప్రధాన హాలులో భజనలు జరుగుతుంటాయి. స్వామి భక్తులకు దర్శనం ఇక్కడే ఇస్తారు.
విశ్వగురుపీఠం ఎదురుగా ఉన్న యాగశాలలో తరచూ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతుంటాయి. ఆశ్రమంలో ఒక చోట 21 అడుగుల ఎతె్తైన అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం సత్రాలు, గెస్ట్‌హౌజ్‌లు ఉన్నాయి.
విశ్వనగర్‌లో విశ్వంజీ జన్మదినోత్సవం మార్చి 1 నుండి 5 వరకు జరుగుతాయి. అలాగే దత్తాత్రేయ జయంతి, ఇతర పండగల సందర్భంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్యక్రమాలు జరిగే సమయాల్లో భక్తులందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
విశ్వసమగ్రతా స్థూపం
విశ్వ సమగ్రతా స్థూపం 99 అడుగులు ఎత్తు, 45 అడుగుల వ్యాసంతో నిర్మించారు. సత్యం, స్వచ్ఛత, ఐక్యత, గుణం (క్యారెక్టర్) అనే నాలుగు స్తంభాలపై ఈ స్థూపం నిలిచింది. ప్రతి వ్యక్తి ఈ నాలుగు గుణాలు కలిగి ఉండాలన్నదే విశ్వంజీ ఉద్దేశం. ఈ భవనం మూడంతస్తులు కలిగి ఉంది. మెడిటేషన్ చేసేందుకు దీన్ని ఉద్దేశించారు. విశ్వ సమగ్రతా స్థూపానికి ఎనిమిది ద్వారాలున్నాయి. ఎనిమిది ద్వారాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధ, జోరాస్ట్రియన్, సిక్కు మతాలతో పాటు దేవుడంటే నమ్మకం లేని (నాస్తికులు) వారికోసం మరో ద్వారం ఉంది. కుల, మతాలకు అతీతంగా అందరూ సమానమే అన్నది దీని అర్థం. ఏ ద్వారం (ఏ మతం) నుండి లోపలకు వెళ్లినా అందరూ చేరే చోటు ఒక్కటేనని స్పష్టమవుతోంది.
విమ్స్
విశ్వయోగి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్) ను మాతాశిశు కేంద్రంగా ప్రధానంగా రూపుదిద్దారు. ఇక్కడ ప్రతి నెల మూడో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. వైద్యానికి సంబంధించి వివిధ రంగాల నిపుణులు రోగులను పరీక్షించి, మందులను ఉచితంగా ఇస్తున్నారు.

-పి.వి. రమణారావు 98499 98093