AADIVAVRAM - Others

కోతి కొమ్మచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటలు ఆనందానికే కాదు ఆరోగ్యానికి మంచిదే. పిల్లలు కేరింతలు కొడుతూ నలుగురితో కలసి ఆడుకొంటే వారికి ఆనందం, శారీరిక ఆనందంతోపాటుగా మానసిక ఎదుగుదల కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇంతకుముందు బడుల్లో ఆటస్థలం తప్పక ఉండేది. ఇపుడు అపార్ట్‌మెంట్స్ వల్ల ఆట స్థలమే కనుమరుగు అవుతూ ఉంది. దాని వల్ల మన గ్రామీణ ఆటలన్నీ కూడా కనిపించకుండా పోతున్నాయి.
అట్లాంటి వాటిలో కోతి కొమ్మచ్చి ఒకటి. ఈ ఆటకు ఈ పేరు రావడానికి కారణం ఆడేపిల్లలంతా కోతుల్లాగా చెట్లమీద నుంచి ఆడడమే.
ఈ ఆటకు ఇంతమంది ఉండాలని నిబంధన ఏదీలేదు. నలుగురు లేక ఐదుమంది కలసి ఆడుకోవచ్చు. పిల్లలంతా ఒక పెద్ద చెట్టు దగ్గర గుమికూడుతారు. ఆ తరువాత ఆ చెట్టు మొదట్లో గుండ్రంగా ఒక గీత గీస్తారు. ఐదుగురు పిల్లల్లో ఒకరు దొంగగా ఉంటారు.
ఆటలు ఆడేవాళ్లల్లో ఒక పిల్లవాడు తన చేతిలో ఒక చిన్న కర్ర ముక్కను పట్టుకొని ఆట మొదలు కాగానే ఆ కర్రముక్కను దూరంగా విసురుతారు. దొంగగా ఉన్న పిల్లవాడు పరుగెత్తుకు వెళ్లి ఆ కర్రను తెచ్చేలోపు ఈ కర్రను విసిరిన పిల్లవాడు చెట్టును ఎక్కాలి. ఇది ఆట
ఈ పిల్లవాడు చెట్టు ఎక్కేలోపు దొంగ వచ్చి ముట్టుకుంటే వాడు ఆట లో దొంగ అవుతాడు. అంతకుముందే చెట్టు ఎక్కిన మిగతావాళ్లు కిందకు దుముకుతూ మళ్లీ చెట్టు ఎక్కుతూ దొంగకు దొరక్కుండా ఉంటారు. దొంగ వారిని ముట్టుకోవడానికి అటు ఇటూ పరుగెత్తుతూ ఉంటాడు. చెట్టు మొదట్లో గీచుకున్న గీత లోకి దుముకుతే ఆ గుండ్రని గీత మధ్యలో ఉంటే దొంగ ముట్టుకోకూడదు అన్న నిబంధన ఉంటుంది. గుండ్రని గీత బయట ఉంటే దొంగ ముట్టుకుంటాడు. అందుకని దొంగను మురిపిస్తూ చెట్టు ఎక్కిన పిల్లలు ఒక కొమ్మ మీదనుంచి ఇంకో కొమ్మమీదకు దూకుతారు. మధ్యలో నేలమీదకు వస్తారు. ఇలా నేలమీదకు ఉన్నప్పుడు దొంగ చేతికి చిక్కినవాళ్లు మళ్లీ దొంగలు అవుతారు.
ఒక్కోసారి దొంగ గా ఉండడానికి రూపాయి బిళ్లను పైకి ఎగురవేసి బొమ్మ బొరుసా ఆడుతారు.
ఇలా కోతి కొమ్మచ్చి ఆడడంలో ఎంతో ఆనందంతో పాటుగా వారికి మంచి ఆరోగ్యం చలాకీగా ఎగురడం, దుముకడం వంటివి అలవోకగా నేర్చుకుంటారు.

-జంగం శ్రీనివాసులు