Others

అణగారిన ఆశలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలక బలపం పట్టుకోని రానివాళ్లే నేడు జాతీయ స్థాయిలో కార్యదర్శిగా పదోన్నతిని పొందారు. ఇలా చెబుతుంటే నమ్మబుద్ధి కావడంలేదా. నిజం.
చాందినీ ఖాన్ అనే అమ్మాయి మురికివాడల్లో నివసించేది. తన తండ్రితో పాటు గోతాం సంచీ వేసుకొని చెత్త ఏరుకునేది. ఎన్నోసార్లు చెత్తఏరుకునేటపుడు కుక్కలు కరిచేవి. వాటిని తప్పించుకుంటూ పరుగెత్తేది. ఏనాడు చదువుకొంటాను అని అనుకోలేదు. కాని బ్యాగులు వేసుకొని మంచి బట్టలు వేసుకొని స్కూల్స్‌కు వెళ్లేవాళ్లని చూసి మురిసిపోయేది. వీళ్లెంత అదృష్టవంతులో కదా అనుకొనేది.
చెత్త ఏరుకునేటపుడు రాగి వైర్లలాంటివి కనిపిస్తే వాటిని బ్యాగులో వేసుకొని పరుగెత్తేది. ఈ ఏరిన చెత్తను కొనేవాళ్లు దగ్గర ఇస్తే వారు ముప్ఫైనో, యాభైనో చేతిలో పెట్టేవారు. రోజంతా చెత్త ఏరితే వచ్చేది ఆరోజు కడుపునిండా తినడానికే సరిపోయేది కాదు.
ఒకసారి పోలీసులు దొంగతనం చేసిందని చాందినీ ని జైల్లోవేశారు. ఆరోజు చేయని తప్పుకు శిక్ష అనుభవించింది. తాను చెప్పేది వినేవారు కాదు. రోజంతా జైలుల్లో గడుపుతున్నప్పుడు అక్కడి వాళ్లు హాయిగా చదువుకోక ఎందుకిన్ని తిప్పలు అన్నారు.
హూ చదువు.. నాకు ఎవరు నేర్పుతారు. నాకు చదువుకోవాలనే ఉంది. చదువుకుని మంచి ఉద్యోగం చేసి తన వారిని పోషించాలనే ఉంది. కాని చదువుకోవడం ఎట్లా అనుకొంది.
చాందినీ మాటలు ఎవరో విన్నట్టు దొంగతనం చేసేవారి మనసు మార్చాలని ఉద్దేశంతో కొంతమంది వచ్చి వారికి దొంగతనం ఎంత పాపమో చెప్పారు. చదువుకుంటే మీకు తెలివి వస్తుంది అని అన్నారు.
అదిగో అపుడే చాందినీ నోరు విప్పింది.తనకూ చదువుకోవాలని ఉంది అని చెప్పింది. కాని చదువుకోవడమెలానో దారి తెలియట్లేదని వారితో చెప్పింది. అపుడే దశ తిరిగింది. వారు ఎన్‌జీఓల దగ్గరకు వెళ్లడానికి దారి చూపించారు.
ఇదిగో వీరి దగ్గర చదువునేర్చుకోవచ్చు అని చెప్పారు. వెంటనే చాందిని తనలో అణగారి పోయిన ఆశలకు రెక్కలు వచ్చాయి. వారి దగ్గర చదువుకోవడానికి శ్రీకారం చుట్టింది. పదేళ్ల వయస్సులో ఓపెన్ స్కూల్‌లో అడుగుపెట్టింది. ఇదే చాందినీ జీవితంలో మలుపు. ఇక తిరుగుచూసుకోలేదు.
తాను చదువుకోవడంలో శ్రద్ధ కనబర్చింది. అంతే కాదు తనే కాక తనలాంటి వాళ్లు చదువుకోవాలని ఆ చెత్త ఏరే జీవితాన్నుంచి బయట పడాలనుకొంది.
అపుడే తనకు తెలిసిన వాళ్లు జైలుకు వెళ్లారన్న సంగతి తెలిసి ఆమె స్టేషన్ కు వెళ్లింది. తన జీవితాన్నంతా చెప్పింది. పదేళ్ల వయస్సులో పలక బలపం పట్టుకొని నేడు ఇంకొకరికి కూడా చదువునేర్పించే స్థాయిలో ఉన్నానని చెప్పే చాందిని మాటలు వారు విన్నారు.
నిజమే. అవకాశాలు రావాలి. పరిస్థితులను మనం మన చేతుల్తో మార్చుకోవాలి. వారిని స్టేషను నుంచి బయటకు తీసుకొచ్చి తాను చదువుకునే దగ్గరే వారి దగ్గరకు తీసుకొని వెళ్లి వారికీ చదువునేర్చుకోవడానికి దారి చూపించింది.
మానవత్వం కలిగిన చాందినిని చూసి పక్కవారికి సాయపడే ఆమె గుణాన్ని చూసి ఆమెకు చదువు పట్ల ఉన్న శ్రద్ధ చూసి ఎన్‌జీఓలు తనను విద్యావాలంటీర్‌గా చేశారు. తాను చదువుకుంది. తన లాంటి మురికి వాడల్లో చదువుకోవడానికి వీలు లేని పరిస్థితులను ఎదుర్కొంటున్నవారికి చేయూత నివ్వడానికి బయలుదేరింది. కొత్త కొత్త విద్యాకేంద్రాలను నెలకొల్పడానికి తాను శ్రమించింది. అందుకే చాందినీని జిల్లా కార్యదర్శిస్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాతగా నిల్చింది. చదువుపట్ల ఆసక్తి ఉన్నవారినీ చదువుకునే పరిస్థితులు లేనివారికి తానే అండగా నిలబడుతోంది. వారికి చదువుకునే పరిస్థితులను కల్పించడంలో చాందిని నిజంగా చాంద్‌కి తుకడానే.
యువర్స్ స్టోరీ సౌజన్యంతో...

చిత్రాలు..అనుభవాలను వివరిస్తున్న చాందినీ ఖాన్
విద్యావాలంటీర్‌గా తనవంతు కృషి చేస్తున్న చాందినీ ఖాన్