AADIVAVRAM - Others

నీ తెలుగెవ్వరి పాలుచేసి తిరిగెదవాంధ్రా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ తెలుగెవ్వరి పాలుచేసి తిరిగెదవాంధ్రా?-అని నొచ్చుకున్నారు మహా పండితులు శివరామశాస్ర్తీగారు. వీరు శతావధాని. షడ్దర్శన పండితుడు. 20వ శతాబ్దం తెలుగునాట మహాపండితులలో వీరు ఒకరు అని విశ్వనాథ సత్యనారాయణగారి ప్రశంసనార్జించినవారు. ఇక్కడి సురవరం ప్రతాపరెడ్డి గారితో, సామల సదాశివగారితో వేలూరి వారికి ఆత్మీయ సాహిత్య బంధుత్వం ఉండేది. కిందటి శతాబ్దంలో అందునా ముఖ్యంగా స్వాతంత్య్రానంతరం తెలుగు భాష మర్యాద, ప్రాముఖ్యం క్రమేణా మసకబారుతూ వచ్చాయి.
1964లో ఆంధ్రకేసరి ప్రకాశం ఆంధ్ర విశ్వకళాపరిషత్తు స్నాతకోత్సవ ఉద్బోధ తెలుగులోనే గావించారు. తెలుగు భాష పట్ల ప్రకాశం పంతులుగారికి చాలా ప్రేమాభిమానాలుండేవి. ఇంగ్లండులో తాను బారిస్టరు విద్య చదువుతున్నప్పుడు ఆ దేశంలో చారిత్రక, సాంస్కృతిక, మహాకవి సంస్మరణ తీర్థాటన ప్రదేశాలు చూసినప్పుడు అయ్యో! తెలుగునాట ఇటువంటి జాతీయ స్మారక ప్రదేశాలు, భాషా సాహిత్య సాంస్కృతిక ఉత్తేజకర స్మరణీయ ప్రదేశాలు లేవే అని బాధపడేవాడినని స్వీయ చరిత్రలో ఆయన చెప్పుకున్నారు. ముఖ్యంగా షేక్స్‌స్పియర్ మహాకవి స్మారకంగా స్ట్రాక్ ఫర్ ఆవన్‌లో ప్రపంచ ప్రసిద్ధంగా నిర్మించిన స్మారక భవనం, అందులో ఆయన రాతప్రతులు ప్రదర్శించిన తీరు చూసి చాలా ఉత్తేజం పొందాననీ, ఆంధ్రదేశం వెళ్లిన తరువాత రాజమహేంద్రవరంలో నన్నయ్యకు, ఓరుగల్లులో పోతనకు, నెల్లూరులో తిక్కనకు ఇటువంటి తరతరాల స్మరణీయ భవనాలు నిర్మించాలని సంకల్పించినట్లూ, కాని తన రాజకీయ జీవితం ఒడిదుడుకులలో, స్వాతంత్య్రోద్యమ సంచలన సంఘటనలలో తాను సంకల్పించిన పని పూర్తి చేయలేక పోయినట్లు ఆంధ్రకేసరి స్వీయచరిత్రలో ప్రసక్తం చేశారు.
ప్రకాశం పంతులుగారికి నూరేళ్ల కిందట ఇటువంటి ఆలోచన వచ్చినా ఇంతవరకు తెలంగాణలో కాని, తీర్థాంధ్ర ప్రాంతంలో కాని ఆయన కన్న కలలు సాకారం కాలేదు. స్వాతంత్య్రోద్యమంలో తొలిసారి జాతీయ పాఠశాలలు స్థాపించుకున్నవారు తెలుగువారు. మాతృభాషను విద్యా మాధ్యమం చేసిన వారు తెలుగువారు. అయినా ఇప్పుడు దేశంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలలోనే కాక దేశంలో వెనుకబడిన వారు తెలుగువారేమో ననుకోవాలి.
దేశభాషలలో విజ్ఞాన సర్వస్వాన్ని మొదట నిర్మించుకున్న వారు తెలుగువారు. కాని ఇప్పటికీ సమగ్రతను సాధించుకోలేక పోయారు. మన విజ్ఞాన సర్వస్వాన్ని మార్గదర్శకంగా చేసుకుని తక్కిన భాషల వారు ఎంతో పురోభివృద్ధి సాధించారు. శ్రీ్ధర వేంకటేశ కేట్కర్ అనే మహారాష్ట్ర పండితుడు, సాహిత్యాభిమాని కొమర్రాజు వారి మార్గదర్శనంలో, సలహా సంప్రదింపులతో మరాటీ విజ్ఞానర సర్వస్వాన్ని పూర్తి చేసినట్లు స్మరించుకున్నారు. తెలుగువారికి ఇప్పటికీ ఆధునిక నిఘంటువు లేదు. గిడుగు రామమూర్తి పంతులుగారితో ఒక సమగ్ర, సంపూర్ణ నిఘంటువును తెలుగు వారు సమకూర్చుకోలేక పోయినారని 1963లో విశ్వనాథ సత్యనారాయణ గారు కృష్ణా పత్రిక వజ్రోత్సవ సంచికలో స్మరించారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు- ఆధునిక తెలుగు వ్యవహారంలో వేల పదాలు మన తెలుగు నిఘంటువులలో కనపడవు. కొన్నాళ్ల తరువాత తెలుగంటూ ఉంటుందా? అని బాధ కలుగుతోంది... అన్నారు.

-అక్కిరాజు రమాపతిరావు