AADIVAVRAM - Others

జానపద సంబరం.. ‘శిశిరోత్సవం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలానికి వీడ్కోలు పలుకుతూ గోవాలోని హిందువులు ఏటా మార్చి నెలలో జరుపుకునే ‘షిగ్మోత్సవ్’ (శిశిరోత్సవం) జానపద సంప్రదాయాలకు అద్దం పడుతుంది. హిందూ సంస్కృతిని, పురాణగాథల విశిష్ఠతను చాటిచెప్పేలా పల్లెవాసులు ఈ ఉత్సవాన్ని ‘హోలీ’ మాదిరి ఘనంగా జరుపుకుంటారు. గోవాలోని హిందువులు దీనిని పెద్దపండుగలా భావిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు జానపద కళారీతులను ప్రదర్శిస్తూ ఆనందోత్సాహాల్లో తేలియాడతారు. ఫగ్డీ, ధాలో, ఘోడే మోడ్నీ, దేక్ని వంటి విభిన్న జానపద నృత్యాలను అభినయిస్తారు. సంప్రదాయ వస్తధ్రారణతో నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ వీధుల్లో కేరింతలు కొడతారు. ‘పోండా’ పేరిట ప్రారంభమయ్యే ఉత్సవాలు రెండు వారాలపాటు కనువిందు చేస్తాయి. ఉత్సవాలు జరిగే 14 రోజుల్లోనూ మాంసాహారానికి దూరంగా ఉంటూ తమ ఇష్టదైవాన్ని మనసారా ఆరాధిస్తారు. ఉత్సవాల్లో అయిదవ రోజున ‘హోలీ’ మాదిరి ‘రంగ్ పంచమి’ని వేడుకగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు ‘గులాల్’ జల్లుకుంటూ ఆనందాన్ని పంచుకుంటారు. గ్రామీణులు రంగురంగుల దుస్తులను ధరించి, కాంతులీనే జెండాలను చేత పట్టుకుని ఆలయాలకు వెళతారు. ఆలయాల ముందు జానపద గీతాలను ఆలపిస్తారు. పెద్దసైజు ‘డ్రమ్స్’పై భారీ శబ్దాలు చేస్తూ మహిళలు, పురుషులు సందడి చేస్తారు. జానపద నృ త్యాలు, పాటలు, వాయిద్యాల హోరుతో ఎక్కడ చూసినా పండుగ కళ వెల్లివిరుస్తుంది. ‘కొంకణ్’ ప్రాంతం నుంచి గోవాకు వలస వచ్చిన వారు సైతం ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. కొంకణి భాషలో ‘షిగ్మో’ అంటే ‘ప్రకృతి’ అని అర్థం. ‘షిగ్మోత్సవ్’ అంటే ‘ప్రకృతితో మమేకమైన’ సంబరం. గోవా ప్రజలు అనాదిగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది.
ఈ ఉత్సవాన్ని ‘్ధక్తో షిగ్మో’ (చిన్న షిగ్మో), ‘వాడ్లో షిగ్మో’ (పెద్ద షిగ్మో) పేరిట రెండు విధాలుగా పాటించడం ఆనవాయితీ. ‘చిన్న షిగ్మో’ను ప్రధానంగా రైతులు, కూలీలు, పల్లెవాసులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ‘పెద్ద షిగ్మో’ను అన్ని వర్గాల వారూ కలసి మెలసి నిర్వహిస్తారు. ‘చిన్న షిగ్మో’ను ఫాల్గుణ మాసంలో పున్నమికి అయిదురోజుల ముందు ప్రారంభిస్తారు. ఒకప్పటి పోర్చుగీస్ పాలనలోని ప్రాంతాల్లో ‘చిన్న షిగ్మో’కు ప్రాధాన్యత ఇస్తారు. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పున్నమి రోజు నుంచి ‘పెద్ద షిగ్మో’ సంబరం మొదలవుతుంది. గ్రామాల్లోని కూడలి ప్రాంతాల్లో స్థానికులంతా గుమికూడి జానపద నృత్యాలతో, పాటలతో, భారీ వాయిద్య పరికరాలతో కోలాహలం చేస్తారు. జానపద కళాకారులు ఇంటింటికీ వెళ్లి కానుకలు స్వీకరిస్తారు. ఉత్సవాల చివరి రోజున చెరువుల్లో సామూహికంగా స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమలో కొత్త శక్తి ప్రవేశిస్తుందని, ఏడాదంతా తాము కష్టపడి పనిచేయగలుగుతామని పల్లెవాసుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవం జరిగే 14 రోజుల్లోనూ ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ జాంబవలి, ఫతార్ప్యా, కన్సర్పాల్, ధర్గాలే వంటి దేవతలకు పలురకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అత్యంత కోలాహలంగా జరిగే ‘శిశిరోత్సవం’ సందర్భంగా గోవాకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు.