Others

సాహసానికి పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక సేవ, అసాధారణ సాహసాలతో విశేష మన్ననలు, అవార్డులు అందుకున్న ఉత్తరప దేశ్ యువతి నజియాఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉత్తరప దేశ్ డీజీపీ ఓ.పి. సింగ్ చేతుల మీదుగా ఆగా పోలీసులు ఆమెకు ప్రత్యేక పోలీసు అధికారి హోదాను ఇచ్చారు. భయమంటే ఎరుగని పద్దెనిమిది సంవత్సరాల నజియా మునుపు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ దందా నడుపుతున్న ముఠాలను పట్టుకోవడం, ఆరేళ్ళ చిన్నారి కిడ్నాప్‌ను అడ్డుకోవడం, అందుకు ఆమె ఈ ఏడాది సాహస అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ( ఐసీసీడబ్ల్యూ) ఇచ్చే అత్యున్నత పురస్కారమైన భారత అవార్డు కూడా ఆమెను వరించింది. మునుపు ఈమెకు దుండగుల నుంచి ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ నజియా వాటిని లక్ష్యపెట్టకుండా తమ ప్రాంతంలోని బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ముఠాల అంతు చూసింది. నేరస్థులు బెంబేలెత్తిపోయేలా అనేకసార్లు వారిపై కేసులను పెట్టింది. చాలాసార్లు ఆమె పోలీసులకు బలమైన సాధనంగా ఉపయోగపడింది. *
*
మాతృభూమికి రచనలు పంపవలసిన
చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003