Others

సెల్ జోరీగలూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతకాలం క్రితం ఉద్యోగినులు కాని మహిళలు వారి పని అవగానే పక్కింటికి పోయి ఉబుసుపోక కబుర్లు చెప్పేవారు. అవతల వారి పని అయినా కాకపోయినా సరే వీరు పనిగట్టుకుని ఆ యమ్మ , ఈయమ్మ కబుర్లు చెప్పుతూ పోయేవారు. అవతలి వారు వీరిని భరించలేక, అది చెప్పలేక సతమతమై పోయేవారు.
ఈమధ్య ఇట్లాంటి స్ర్తిలు తక్కువ అయ్యారు. కాని కొత్త సమస్యలు తెచ్చే వారు ఎక్కువ అవుతున్నారు. మహిళలూ ఇట్లా చేయవచ్చునా ఒకసారి ఆలోచించండి.
ఆధునికత అందరూ కోరుకుంటారు. కానీ ఆ ఆధునికత వెర్రితలలు వేస్తే అందరికీ తలనొప్పి పుడుతుంది. అదే సమస్యగా తయారు అవుతుంది.
ఇప్పుడు ప్రతివారికి ఒక ఫోను ఉండడం సహజం. పనిచేసుకొనేవాళ్లు కూడా ఎస్‌యమ్‌ఎస్‌లు పంపుతున్నారు. వారికీ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తరువాత వాట్స్‌అప్‌లు, ఫేస్‌బుక్‌లు ఎక్కువ అయ్యాయి. వాటిని మంచి పనులకు ఉపయోగించుకుంటే సమస్యనే రాదు. కానీ ఉద్యోగినులు కానివారు, కొందరు ఉద్యోగినులు సైతం పని గట్టుకొని పేజీలకు పేజీలు వాట్స్‌అప్ మెసెజ్ పంపుతుంటారు. ఆ మెసెజ్ వల్ల వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. పైగా అవతల వారికి అంటే ఆ మెసేజ్ అందుకున్నవారికి పనికి వస్తుందా రాదా అన్న ధ్యాస అసలు ఉండడం లేదు. పంపడమే ముఖ్యం. మరికొంతమంది చెవుల్లో ఈయర్ ఫోన్స్ పెట్టుకొని బస్‌లు ఎక్కడం, దారిలో నడవడం స్టైల్ గా చేస్తున్నారు. బండ్లమీద ప్రయాణిస్తూ కూడా ఫోన్ చెవికి అతికించుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ పట్టుకుని మాట్లాడడం చూస్తే వీరికి ఏదైనా రాకూడని రోగం వచ్చిందా అనిపిస్తుంది. అంత మరీ సమయం మించకుండా మాట్లాడాల్సే వస్తే బండిని పక్కకు ఆపుకుని మరీ మాట్లాడవచ్చు కదా. ఇట్లా చేస్తున్నారు కనుకనే ఎవరికి వారు వేగంగా వెళ్తూ రోడుప్రమాదాలుగురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఫోన్ లో తలదూర్చి నడిచే మహిళలను ఏమనాలి. వాహనదారులకే కాదు ఆ దారిన రోడ్ దాటేవారికి కూడా ఇది సమస్యనే అవుతుంది.
ఇంకొంతమంది ఎక్కడున్నామని చూసుకోక వీడియో కాల్స్ చేస్తుంటారు. వీరి వల్ల వీరికే కాదు అవతల వారికి కూడా ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. దాన్ని చూస్తూ తన ముందు ఏంజరుగుతుందో చూసుకోవడం లేదు. బస్సులో ఎక్కి కూర్చునో లేక నిల్చునో ఫోన్‌లో మునిగిపోతే వారికి టికెట్ తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా విస్మరిస్తున్నారు. కండక్టర్ అడిగినా వీరికి వినపడదు. కొందరు కండక్టర్ మహాశయులు కూడా ముందు ఫోను తర్వాత టికెట్ అనేవారు ఉన్నారు లెండి...
ఫేస్‌బుక్‌లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. పనికివచ్చే మేటర్‌కన్నా పనికి రాని చెత్తను నింపడంలో ఆసక్తి ఎక్కువ అవుతోంది. కనుక ఈ కొత్త టెక్నాలజీ ఉపయోగించేవారు ఏది అవసరమో ఎంత అవసరమో తెలుసుకొని అంతమేరకు దీనిని వాడితే అనుకొన్న ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే ఒకనాడు ఉబుసుపోక కబుర్లు చెప్పేవారిని ఎలా ఈసడించుకొన్నామో ఇపుడు పనికిరాని చెత్తను పంపే సెల్ జోరీగలను తిట్టుకోక తప్పదు.

- గౌరి