Others

మూర్తిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సప్త రాత్రోషితంబుద్బుదం భవతి’’
అని ఏడు రాత్రులకు బుడగగా ఈదుతూ
మొదటి మాసంలో త్వక్‌స్వరూపమై,
పక్షాలలో మాసాలలో పిండమై,
రక్తమాంసాల మజ్జతో ఎముకులగూడుగా-
చర్మం కప్పుకున్న పిడికెడి రూపం నాది!!
నా శారీరక, మానసిక మార్పులు నీవక్క దానికే అవగత వౌతాయిగా తల్లీ!
ఏడో మాసంలో మేధ ఏర్పడి నీ గర్భంలో పరిభ్రమిస్తూ-
పరిణామమొందుతూ, నవమాసాల అంతర్గత శోధనదాటి-
‘‘త్రిపాదూర్ధ్వ ఉతైత్పురుషునిగా’’
ఆరాటాల పోరాటాలు సాగించాను గదా జననీ!
గాఢాంధకార బిలంలో నాకై నేనే ప్రశ్నించు కుంటున్నప్పుడు-
నీ మనసు మాత్రమే ఏవో మూగకథలు నాకు చెపుతుంటే-
అంతర్గత, బాహ్యగత విషయాలకు
అభిమన్యునిలా సాక్షీభూతుడైనాను!
నాకోసం తపిస్తూ, వేగిరపడుతున్న నీ మనోభావాలపుటంలో
ఏవేవో అర్థంకాని సంకేతాలను నీ కందిస్తున్నాననుకొని
నీవు నిద్రించినపుడు నేను మేల్కొని, నీ అంతర నేత్రాల నుంచి
నాదైన బాహ్యప్రపంచాన్ని తిలకించాలని, పరిశీలించాలని
నాకర్థం కాని ఏదేదో భాషను, నాలోనికి నేనే అనువదించుకోవాలని,
ప్రగాఢంగా ప్రయత్నిస్తూనే వున్నాను! నాచుట్టూ పరిభ్రమిస్తున్న ‘‘అరోమా’’ ఆచ్ఛాదనలో
నీ ఆశయాల తీపిగురె్తై మూర్తిత్వం పొందాలనే,
తపనతో తడిసిముద్దైపోయాను!!
నీ గర్భంలో ఇమిడి పోయిన తొమ్మిది నెలలు,
తొమ్మిది యుగాలై తొందర పెడుతుంటే...
నీ బాహ్యస్పర్శ కోసం నా లేలేత పసితనం,
త్రివిక్రమాత్వాన్ని శిల్పీకరించుకుని సన్నద్ధమైంది తల్లీ!!

- బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199