Others

ఆది అంతమూ అమ్మే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది అమ్మే అంతమూ అమ్మే
అమ్మ ఎప్పటికీ అమ్మే
ఆరు ఋతువులేమైనా
ఆరని వెనె్నల దీపం
చల్లని చూపుల జాబిలి
మానవ సృష్టిని నడిపే
కనిపించని ప్రకృతిలో
కనిపెంచిన అమ్మేకద!
అమ్మ అంటె అర్థమేమిటి?
అనురాగం - మమకారం
ఎల్లప్పుడూ మనకేగా
అందించెను సహకారం
నిరతం తన భావనలే
మన భవితకు దీవెనలు
తల్లి బతుకు కడవరకూ
బిడ్డల క్షేమం కొరకు
పుడమి పైన అమ్మవలనె
నిలిచి ఉంది మన జన్మ
ఎప్పుడైనా చూడలేదు
బిడ్డ కంటిలోని చెమ్మ
అమ్మ ఎప్పటికీ అమ్మే!
అమ్మ అమ్మలాగే ఉంది
అందరి క్షేమం కోరుకుంటూ
బిడ్డలే మారారు
సిరికోసం అడుగు లేసి
పరుగులెడుతూ
విలువల గిరి దాటారు
తల్లినేమో విడిచారు
కాని అమ్మే అమ్మ
ఎప్పటికీ అమ్మే
ఆది అంతమూ అమ్మే

- వి. రమేష్