Others

అమ్మంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో జాబిలిని చూచినపుడు
అమ్మే గుర్తొస్తుంది
‘చందమామ రావే’ అంటూ
బతుకు పుస్తకం మొదటి అధ్యాయంలో
నామనసు దోగాడుతుంది!
ముద్ద ముద్దకూ అప్యాయతా నేతిని అద్దిన
అమ్మ చేతి గోరుముద్దలు తినే
బాల్యానిదెంత అదృష్టమో!
చనుబాలతో నెత్తుటిని, సేవలతో దేహాన్ని
ధారబోసే దాతృత్వం అమ్మ!
రసనా వేదికపై
తెలుగు తల్లి కొలువై నన్నాశీర్వదించింది
‘అమ్మ’నే తొలిపద అక్షిత తోనే!
నింగి అలంకరించుకున్నంత నిర్మలత్వం అమ్మది
అప్పుడప్పుడు ఉరిమే మేఘం తానైనా
ఆమె కురిపించే అనురాగపు జడిలో
తడిసి ముద్దైన అనుభవం నాది
బిడ్డ శ్రేయస్సు కోరి
వెన్నంటే ఉండే శుభాశ్శీసు అమ్మంటే
ప్రకృతి పుస్తకాన్ని తెరచి చూస్తే
ప్రతి పుటలో కనిపించేది అమ్మే
ని దైవం ఎవరని అడిగితే అమ్మనే చెబుతా
ఈ లోకం తలుపు తెరచి
నన్నా హ్వానించిన మొదటి వ్యక్తి ఆమె గనుక
అమ్మంటే
మూతి తుడిచి కడిగిన చేయి కాదు
నీ బరువు బాధ్యతల పల్లకీని మోస్తున్న బోయి

-పి. వెంకట శివారెడ్డి చరవాణి: 9493325573