Others

నిత్య విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య విద్యార్థులు మీరైతే జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా మీరే విజేతలుగానే ఉంటారు. జీవితంలో అతి ముఖ్యమైన దశల్లో ఉద్యోగ జీవితం ఒకటి. ఇక్కడ మనం ఎంత అద్భుతంగా రాణిస్తే మన మిగతా జీవితం అంత అద్భుతంగా గడిచిపోతుంది. ఉద్యోగం మనకి సంపాదన ఇచ్చే వనరు మాత్రమే కాదు మనలో వున్న కార్యసాధకునికి పదునుపెట్టి మనకి మాటల్లో చెప్పలేని ఉద్యోగ సంతృప్తిని ఇచ్చేది కూడా. మార్పు నిత్యకృత్యమైన నేటి ఆధునిక యుగంలో అదనపు నైపుణ్యాలు తప్పనిసరి.
ఇందుకోసం ఎన్నో డిప్లమోలు, సర్ట్ఫికెట్ కోర్సులు, డిగ్రీలు మనకి అందుబాటులో వున్నాయి. ఇందులో కొన్ని ఇంట్లో కూర్చుని ఇంటర్నెట్‌లో చేయగలిగేవి, సెలవురోజుల్లో క్లాసులకి హాజరై పూర్తి చేయగలిగేవి కూడా వున్నాయి. ఇక వుండాల్సిందల్లా మనలో శ్రద్ధే.
ఏ రంగంలో పనిచేసేవారైనా సరే ఆరంగానికి సంబంధించి నైపుణ్యాలను పెంచుకోవడం తప్పనిసరి. యాంత్రిక యుగం లో ఎపుడైనా చేసే ఉథ్యోగాలకు అడ్డంకులు రావచ్చు. అందుకే ప్రతినిమిషం పని చేస్తునే సమాజంలో జరిగే మార్పులను కనిపెట టగలగాలి. ఆర్థిక రంగాన్ని సమీక్షించుకుంటూనే ఉండాలి. సమాజానికి అవసరమైన వస్తూత్పత్తిని తయారు చేయడంలో ముందుంటే చేసేదే ఉద్యోగమైనా నైపుణ్యంతో ప్రగతికారకులు మీరే అవచ్చు.
అది లేకుంటే సంక్షోభ సమయంలో బలిపీఠంమీద నిలబడాల్సి వుంటుందన్న విషయం మర్చిపోకూడదు.
ఇంతకుముందుకాలంలో అధ్యాపకులు నిత్యవిద్యార్థులు గా ఉండేవారు. కాని కాలం తీసు కొచ్చిన మార్పులతో ప్రతివారు నిత్యవిద్యార్థులు కావాల్సిన అవసరం ఉంది.

--చివుకుల