Others

చర్విత చరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం కొత్తదేం కాదు
కాలానికిమనమే కొత్త !
నీకు నేను నాకు నువ్వూ కొత్తేం కాదు
ఇపుడు కొత్తగా
వింతగా విస్తుపోయేదేం ఉంది
కొత్తగా పలకరింపులకేం ఉంది
గుంపులు గుంపులుగా
పిట్టల్లా వాలిన జ్ఞాపకాలు మోసుకుంటూ
కన్నీటి చారికల దారుల నీడల్లో
మెదలిన క్షణాలు నెమరేసుకుంటూ
సాగిపోయే బాటసారులం మనం
ఎక్కడో మనం కలిసే ఉంటాం
చూపుల్ని చూపులతో నవ్వుల్ని నవ్వులతో
కొలుచుకునే ఉంటాం
ఆనవాళ్ళేవో పోల్చుకునే ఉంటాం
కాలంతో కరచాలనం చేసే వుంటాం
కాలం పొడవునా సాగిన పాటలో
మనమంతా చర్విత చరణాలం
శాంతి గురించి వివిధ రకాల శాంతుల గురించి
భ్రదత గురించి వివిధావస్థల్లోని భద్రత గురించి
చివరికి ఏదీ వదలకుండా ప్రపంచ శాంతి గురించీ
మనం మాట్లాడేసుకునే ఉంటాం
నిలువెత్తు అద్దంలో
ప్రశాంతంగా మందస్మిత వదనంతో
నిన్ను నువ్వు చూసుకొనే ఉంటావు -
ఆ తరువాత
అద్దాల మహల్ లో
నన్ను నీవు, నేను నిన్ను
ఇపుడు చూసుకొందాం
సరికొత్త అర్థాలు కనిపిస్తాయా?
కులాలు, మతాలు,
గోత్రాలు, ప్రాంతాలు
జాతులు, నీతులు, భాషలు,
యాసలు, నీళ్ళూ నిప్పులు..
ఏదైనా సరే...
అన్నింటిలో మన ముఖాలు
మన ముఖాలు చీలిపోయాయో
చూశావా...
ఇది ఇంతకు ముందున్నదే
కొత్తే ంకాదు
అపుడు కత్తులుకటార్లతో
ఇపుడు అణుబాంబులతో
వర్షాలను కురిపిస్తున్నాం
ఇది చర్విత చరణమే...

- కావ్యాంజలి