Others

ఇద్దరు మిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1961లో అన్నపూర్ణా సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుగారు ప్రముఖ బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటర్జీ రచన ‘తారుమారు’ ఆధారంగా తొలిసారి అక్కినేని నాగేశ్వరరావుగారి ద్విపాత్రాభినయంతో ఆదుర్తి సుబ్బారావుగారి దర్శకత్వంలో నిర్మించిన చక్కటి కథా చిత్రం. అజయ్‌బాబు (ఎఎన్‌ఆర్) సంపన్నుడు మేనత్త (జి.వరలక్ష్మి) పెంపకంలో పెరిగి విద్యావంతుడై వ్యాపార, ఎస్టేటు వ్యవహారాలు చేపట్టేసరికి పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. జమిందారి ఆస్తి వ్యవహారాలు చూసే దివాన్ (గుమ్మడి) స్వార్థపరత్వంతో తన కుమార్తె (రాజసులోచన)ను అజయ్‌బాబుకు ఇచ్చి పెళ్ళి చేసి ఆస్తిపై శాశ్వతంగా పెత్తనం చేయాలని చూస్తాడు. విజయ్‌బాబు (రెండో ఎఎన్‌ఆర్) విద్యావంతుడుగాని చాలా పేదవాడు. పెళ్ళయినా కట్నం ఇవ్వలేకపోవడంతో ఇంట్లోనే ఉన్న చెల్లి, ఆదాయం లేకపోయినా దేవుని పూజలకు అమితంగా ఉన్నదానిని ఖర్చుచేసే దైవభక్తిగల నాన్న, నిరుద్యోగంతో బాధపడుతుంటాడు. ఒకరోజు కారు ప్రమాదంలో కలుసుకున్న ఈ ఇద్దరు ఒక సం.కాలంలో తమ సమస్యలు అధిగమించడానికి అగ్రిమెంటు చేసుకుని స్థానాలు మార్చుకుంటారు. అజయ్‌బాబు మెకానిక్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తూ తన స్నేహితుడి చెల్లిని (ఇ.వి.సరోజ)ను ప్రేమిస్తాడు. ఇక్కడ విజయ్‌బాబు ఎస్టేటు వ్యవహారాలు చక్కపెడతాడు. అతనిని రాజసులోచన ప్రేమిస్తుంది. అజయ్‌బాబు చెల్లి (శారద) కాపురం చక్కబెట్టడానికి చెక్కు ఇవ్వడం, దివాన్ అసలు విషయం తెలుసుకుని విజయ్‌బాబును బ్లాక్‌మెయిల్ చేయడం, రాజసులోచన సహకారంతో, దివాన్ కుయుక్తులు చిత్తుచేసి విజయ్‌బాబు అతడిని పోలీసులకు అప్పగించి తన మిత్రుడు అజయ్‌బాబును జైలు నుండి విడిపిస్తాడు. సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతం ఈ చిత్ర విజయంలో ప్రముఖపాత్ర పోషించింది. ఘంటసాల - సుశీల మధుర గాత్రాలలో జాలువారిన ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’, ‘ఈ ముసిముసినవ్వులు’, ‘పాడవేల రాధికా’, ‘హలో హలో అమ్మాయి’ గీతాలు పద్మనాభం - శారదపై చిత్రీకరించిన హాస్యగీతం నేటికి ప్రేక్షకులను రంజింప జేస్తున్నాయి. సెల్వరాజ్ ఫొటోగ్రఫీలో ఇద్దరి నాగేశ్వరరావుల హావభావాలు అత్యద్భుతంగా చిత్రీకరించడంతో తదుపరి కాలంలో అక్కినేని చిత్రాలకు ఆయనే చాయాగ్రాహకుడిగా పనిచేసారు. అక్కినేని అభినయం, ఇతర నటుల నటన, మధురమైన పాటలతో నేటికీ బుల్లితెరపై ప్రేక్షకులను పరవశింప చేస్తున్న చిత్రం. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ రచనా సాహిత్యంతో పాటలు గుబాళించిన చిత్రం.

-సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్నం