Others

కన్నతల్లి కన్న మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నతల్లి కన్న మిన్న
లేదు జన్మభూమి సోదరా
చేయి చేయి కలుపుదాము
కదలిరమ్ము సోదరీ
కర్మభూమి ధర్మభూమి
భరతభూమి మనదేశం
ఇక్కడ జన్మించడమే
మనకు గర్వకారణం
సిరి సంపదలు, సౌభాగ్యాలు
సంగీత సాహిత్యాలు
చిరస్థాయిగా ఘనతను చాటే
చిత్ర శిల్ప సౌందర్యాలు
పుణ్యగిరులు, పవిత్ర ఝరులు
వెలకట్టలేని ఖనిజ సంపదలు
ప్రపంచానికే గురువై ఇచ్చిన
ఆధ్యాత్మి సందేశాలు
దశదిశలా వ్యాపించని
మన ఔన్నత్యపు కీర్తి చంద్రికలు
కులాలు మతాలు ఎన్నున్నా
ప్రాంతీయ భాష లెనె్నన్నో ఉన్నా
భరతమాతకు కన్నబిడ్డలం
మనమంతా భారతీయులం
భిన్న విభిన్న స్వరూపాలతో
ఏకత్వపు నినాదంతో
రాసి బోసిన రత్నాలం
ఇదే ఇదే మన వైశిష్ఠ్యం

-- సత్యానే్వషి