Others

పసి మనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజా హడావుడిగా ఇంట్లోకి బయటకు తిరుగుతోంది.
ఆఫీసు నుంచి ప్రభాకర్ వడివడిగా వచ్చేశాడు.
‘ఏదైనా సంగతి తెలిసిందా’ ఆత్రుతగా అడిగాడు.
‘లేదు. వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. వాడు నాకు చాలా కోపం వచ్చింది. మనమే బుద్ధి చెప్పాల్సిందే ’అని పొంతన లేని మాటలు మాట్లాడాడని కిరణ్ చెప్పాడు.
‘ఎపుడు మాట్లాడాడట. ఎందుకు కోపం వచ్చింది.’ అడిగావా అన్నాడు ప్రభాకర్
‘అడిగాను. కిరణ్‌వాళ్ల తాత స్కూల్ కు లంచ్ టైమ్‌లో వచ్చాడట. ‘నాయనా నీవు బాగా చదువుకో. నేను ఊరికి పోతున్నాను నీవు ఆడుకొనేటపుడు జాగ్రత్త’ అని చెప్పాడట. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లాడట. ’
కిరణ్ కాసేపు వౌనంగా ఉంటే ‘అవునురా వీళ్లకు బుద్ధి చెప్పాల్సిందే’అని అన్నాడట. రోజా చెప్పింది.
‘కిరణ్ తో ఎందుకలావీడు మాట్లాడాడు’ ప్రభాకర్ దీర్ఘంగా ఆలోచిస్తూన్నాడు.
‘ఏమండీ ఎందుకైనా మంచింది మనం ఒకసారి రాజుపాలెం వెళ్లివద్దాం’ అందిరోజా.
‘అసలే సమస్యగా ఉంటే ఇపుడు రాజు పాలెం ఎందుకు ’ కోపం, విసుగు కలిపి ప్రభాకర్ అన్నాడు.
‘అదికాదు. మనం మొన్న మీ నాన్న గురించి మాట్లాడేటపుడు వాడు మధ్యలో తాతయ్య ఇక్కడికి వస్తున్నారా అని అడిగాడు కదా’ అపుడు నేను నీకెందుకు అని కసురుకున్నాను. ఆ తరువాత చాలాసార్లు వాడు మీ నాన్నగురించే అడిగాడు. కాని నేనే ఏమీ చెప్పలేదు. ’అంది రోజా.
‘దానికి దీనికి ఏమిటి సంబంధం’ జుట్టు పీక్కుకోవాలన్నంత విసుగ్గా ప్రభాకర్ అడిగాడు.
‘అదికాదండి.. నేను మీ నాన్న వస్తే మనకున్న ఇబ్బందులు చెప్పాను కదా. అట్లానే ఆ కిరణ్ వాళ్ల తాత ఇక్కడే ఉండేవాడు కదా. దానివల్ల లేనిపోనీ సమస్యలు వస్తున్నాయని కిరణ్ వాళ్ల అమ్మ నాతో చెప్పేటపుడు మన నానీ అక్కడే ఉన్నాడు.’
‘ ఆమె వెళ్లిపోయిన తరువాత ఒక మనిషి వస్తే అన్ని ఇబ్బందులుంటాయా? ’ అని చాలా సీరియస్‌గా నన్ను అడిగాడు.
నేను నానికి బదులు చెప్పకుండా అనవసర విషయాల్లో తలదూర్చకు అని చెప్పి పంపేశాను. బహుశా వాడు రాజుపాలెంలో మీ నాన్న దగ్గరకు వెళ్లి ఉంటాడు. ’ అంది రోజా.
అపుడే సెల్ మోగింది.
‘అవునా’ అన్నాడు ప్రభాకర్.
ఫోన్ పెట్టగానే ఏంటండీ అన్న రోజాకు నీవు ఊహ నిజమే. మన నానీ రాజుపాలెం వెళ్లాడట. మా నాన్న వాళ్ల ఫ్రెండుకు ఈవిషయం చెప్పి మనతో చెప్పమన్నాడట. మనలను కంగారు పడద్దు రెండు రోజుల్లో నానీని తీసుకొస్తాను అని చెప్పమన్నాడట అని ప్రభాకర్ చెప్పాడు.
అసలు ఎందుకెళ్లాడో మనమే వెళ్లి తెలుసుకొందాం పదండి...అంది రోజా
వెంటనే రాజు పాలెం బయలుదేరారు దంపతులిద్దరూ.
బస్ దిగేసరికి ప్రభాకర్ వాళ్ల నాన్న, మనమడు ఇద్దరూ కరణం దగ్గర నిలబడి ఉండడం చూశారు.
‘లేదండీ.. నేను పెద్దవాణ్ణి అయిపోయాను. నేనే వ్యవసాయం చేస్తాను. లేకుంటే మనుషులను పెట్టి చేయిస్తాను. వచ్చి న పంటను పని చేసినవాళ్లతో కలసి మేము పంచుకుంటాం. ఎలాగైనా మా తాతనునేను ఒంటరిగా వదిలి వెళ్లను. ఇది నా ఒపినియన్ .నేను దీన్ని మార్చుకోను. ఇది అంతే. దీని గురించి మా అమ్మ నాన్న లు వస్తే నాకు సపోర్ట్‌గా మీరు మాట్లాడాలి. మా తాత నన్ను ఇపుడు మా నాన్న దగ్గరకు పంపిస్తాను అంటున్నారు.
అది నాకిష్టం లేదు. నేను చదువుకోలేకపోతాను అని తాత భయం కాని నేను ఇక్కడ ఉండే గవర్న్‌మెంటు స్కూల్ లోచదువుతాను. ఎంతైనా చదవుతాను. కాని నాకు మా తాత కావాలి.
ఇక మీరు ఏమన్నా చేయండి. అసలు నేను ఇక్కడ ఉన్నట్లు చెప్పకండి... సీరియస్‌గా నాని చెప్పుతున్నాడు
ఎనిమిదో తరగతి చదువుతున్న నానీ ఒపినియన్ విన్న ప్రభాకర్ తాను చేసే తప్పేంటో తెలుసుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లాడు. ఏం చేయలేక రోజా కూడా ప్రభాకర్ వెనుక నడిచింది.

-మానస