Others

జననీ నీకు ధన్యవాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనిచ్చిన జననీ
నవమాసాలు మోసావు
నేను కనపడిన క్షణం
ఆనందాబ్ధిలో మునిగిపోయావు
శ్రమను మర్చిపోయావు
నేను కేర్ మనగానే
నీలో నవ్వులు పువ్వులై విరిశాయి
ప్రేమ జల్లులై నాపై కురిశాయి
బుగ్గ గిల్లి ఉగ్గు తాగించావు
జాబిల్లిని చూపి గోరుముద్దలు తినిపించావు
జోలపాడి ఉయ్యాల ఊపి
ఆనందలోకాల్లో తిప్పినావు
బుల్లి బుల్లి అడుగులు నేర్పి
ముద్దుమాటలు నేర్పి
ఆకలితీర్చే అక్షరాలు నేర్పి
నీతికథలు చెప్పి
క్రమశిక్షణమారుపేరుగా నిల్పి
మమతానురాగాలను పంచేనేర్పు నేర్పి
నన్ను నిలబెట్టావు జననీ
నీకిదే ధన్యవాదాలు

-సంపంగి వారి జయచంద్రారెడ్డి 9550294471