Others

శ్రీ షిర్డీసాయి బాబా మహాత్మ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన సినిమా.....

శ్రీ షిర్డీసాయి బాబా మహాత్మ్యం
విజయ్‌చందర్ సాయిబాబాగా అద్భుతంగా నటించిన చిత్రరాజం ‘శ్రీ షిర్డీసాయిబాబా మహాత్మ్యం’. గోగినేని ప్రసాద్ నిర్మాతగా కె.వాసు దర్శకుడుగా నిలబడి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అడుగడుగునా ఆధ్యాత్మికం, ఆర్ద్రత, మమత, సమత- చిప్పిల్లేటట్లు చిత్రించారు. విజయచందర్ సాయిబాబాగా జీవించారు. సాయి ఉండి ఉంటే ఇలానే ఉండే వారేమోనన్నంతగా మనల్ని మెప్పించారు. మనలో భక్త్భివాన్ని రేకెత్తించారు. ఆచార్య ఆత్రేయ పాటలు, ఇళయరాజా సంగీతం, గాత్రం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, సుశీల, జానకి- ఇక చెప్పేదేముంది. మనసుని తాకి సేద తీర్చాయి. అన్ని పాటలూ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘బాబా సాయిబాబా, నీవూ మావలె మనిషివని- అంటే ఎలా నమ్మేది?’ అనే పాట మన హృదయాల్ని బరువుచేసి పిండేస్తుంది. చంద్రమోహన్, అంజలిదేవి, రమాప్రభ, నిర్మల, కాంతారావు, త్యాగరాజు, జె.వి.సోమయాజులు, తమతమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. ముఖ్యంగా అప్పటివరకూ త్యాగరాజు విలన్ పాత్రల్లో ఉన్నాడు. ఇందులో కరుణ రసాన్ని సహజంగా చిలికించాడు. గణనీయంగా మెప్పించాడు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రకావ్యం. ఈ సినిమా నాకు ఈ వ్యాసం రాస్తున్నంత సేపూ నా మనోనేత్రంలో ఆ సినిమా కదులాడుతూనే ఉంది.
-జానపాటి వేంకటరావు,
బాలాజీ నగర్,
నెల్లూరు-524002

నాకు నచ్చిన పాట....

‘నీవులేని వీణ పలుకలేనన్నది...’
దాదాపు యాభై ఏళ్ల క్రితం అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ ద్వారా విడుదలైన చిత్రం, ‘డాక్టర్ చక్రవర్తి’. యద్దనపూడి సులోచనారాణి కలం నుండి కథ రాయబడింది. ఆ చిత్రంలో ‘‘నీవులేని వీణ పలుకలేనన్నది,
నీవులేక రాధా నిలువలేనన్నది’’- అనే పాట గానకోకిల సుశీలగారు మధుర మధురంగా ఆ పాటను ఆలపించారు. ఆ పాటను నా జీవితాంతం మరువలేకపోతున్నా. అద్భుతమైన సాహితీ సౌరభాలు డా.సి.నా.రె గారు పూయించారు. కథాపరంగా జగ్గయ్య భార్య సావిత్రిని ఎఎన్‌ఆర్ తన స్వంత చెల్లెలు మాదిరిగా భావించి తరచూ ఆ యింటికి వెళ్తూవుంటాడు. ఇవి ఓర్వలేక ఎఎన్‌ఆర్ భార్య జానకి సహించలేక ఎఎన్‌ఆర్‌కు సావిత్రికి అక్రమ సంబంధమున్నట్లు కథ అల్లి దూరంలోఉన్న జగ్గయ్యకు తప్పుడు లెటర్ రాస్తుంది. అది తెలియకుండా అగ్నిగుండంగా రగులుతూ సావిత్రి ఇంటికి వస్తాడు. అదే సమయంలో విరహయోగం తోడై మేడనుండి కిందికి దిగుతూ యిలా పాడుతుంది. ‘తలుపులన్నీ నీకై తెరచి వుంచినాను, తలపులేవో మదిలో దాచివేసినాను’అనే చరణం పాడుతూ జగ్గయ్యకు కనిపిస్తుంది. ఆ సన్నివేశంలోనే సావిత్రిని చూడడానికని వచ్చి అప్పుడే ఎఎన్‌ఆర్ జగ్గయ్యకు కన్పిస్తాడు. సన్నివేశం అద్భుతంగా రక్తికట్టింది. పాట యింకా అద్భుతంగా శ్రోతలకు తన్మయత్వంలో ముంచింది. ఈ పాటంటే నాకు చాలా యిష్టం.
- ఎస్.బాషుమియా,
ఉలిందకొండ, కర్నూలు జిల్లా.