Others
ఓర్పు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 May 2018
- డా॥ బుర్ర మధుసూదన్ రెడ్డి
బండల్ని దోచేసి
బతుకు బండగా మార్చి
బంగళా కట్టారు
బతక నేర్చినోళ్లు
అయినా ఫరవాలేదు!
అడవుల్ని మింగేస్తూ
అందలం ఎక్కేసి
ప్రకృతి రమణీయతను
పరిహాసమాడారు
అయినా సహిస్తాను!
గాలికే గాయం చేస్తూ
మట్టి మర్యాదను మంట గలిపి
ప్రాణి మనుగడే ప్రశ్నార్థకం చేశావు
అయినా నే ఓర్చుకుంటా!
యువశక్తి యుక్తుల్ని
భావకాలుష్యంతో
వ్యర్థపరుగులు పెట్టించి
భరతమాతను దండిస్తే
చూస్తూ ఊరుకోగలమా? వౌనమునిలా నేను