AADIVAVRAM - Others

విశిష్టతల విష్ణు దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్‌లో ఒక అపురూపమైన హిందూ దేవాలయం పురావస్తు తవ్వకాల్లో బయల్పడింది. నవ రథ్ వాస్తు శిల్పంతో విష్ణు దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న దింజాపూర్ జిల్లాలో మధబ్‌గాన్ గ్రామంలో జహంగీర్‌నగర్ జిల్లాకు చెందిన ఆర్కియాలజిస్టుల బృందం తవ్వకాలను చేపట్టింది. ప్రస్తుత బంగ్లాదేశ్ 1947 ఆగస్టు 14 వరకు అవిభక్త భారతదేశంలో భాగమనే విషయం విదితమే. పాకిస్తాన్‌లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్‌ను తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత 1971లో బంగ్లా ప్రజలు పాక్‌పాలకులపై తిరుగుబాటు చేసి స్వాతంత్య్రాన్ని సాధించారు.
144 చ.మీటర్ల విస్తీర్ణంలో ఏడు అడుగుల ఎత్తున ఇటుకలతో కూడిన దేవాలయ నిర్మాణం ఈ తవ్వకాల్లో బయల్పడింది. ఈ నిర్మాణంలో 4.48 మీటర్ల వ్యాసంలో ఉన్న గర్భ గుడి ఉన్నట్లు పురావస్తు శాస్తవ్రేత్తలు గుర్తించారు. ఈ దేవాలయం ఉపరితల వేదికపైన తొమ్మిది రథాలు చెక్కి ఉన్నాయి. ఇది ప్రాచీన నిర్మాణంగా భావిస్తున్నారు. తవ్వకాల్లో అనేక విగ్రహాలు చెక్కి ఉన్న రాతి ముక్కలు, శిల్పాలు ఉన్నట్లు గుర్తించారు. అలంకరించిన ఇటుకలు, కుండలు, రాతి ముక్కలు తవ్వకాల్లో బయల్పడుతున్నాయి. విష్ణురూపం చెక్కి ఉన్న శిల్పాలు ఉన్నట్లు ధృవీకరించినట్లు బంగ్లాదేశ్ పురావస్తు శాఖ నిపుణులు, జహంగీర్‌నగర్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ స్వాధీన్ సేన్, ప్రొఫెసర్ సయ్యద్ మహమ్మద్ కమ్రూల్ అహ్సన్, ప్రొఫెసర్ సీమా హోక్ తెలిపారు. తవ్వకాల్లో సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించి రేడియో కార్బన్‌ను బట్టి ఈ దేవాలయం ఏ శతాబ్ధంలో నిర్మించారో నిర్ధారించనున్నట్లు ఆర్కియాలజీ నిపుణులు చెప్పారు. ఈ దేవాలయం శిఖరం అత్యున్నత నిర్మాణంగా కనపడుతోంది. అవిభక్త బెంగాల్‌లో ఇటుకలతో నిర్మించిన దేవాలయాలు ఎక్కువ. పశ్చిమబెంగాల్‌లోని బంకురాలోని సిద్ధేశ్వర దేవాలయాన్ని ఈ దేవాలయం పోలి ఉన్నట్లు కోల్‌కొతా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ప్రొఫెసర్ దీపక్ రంజన్ దాస్ చెప్పారు.
బంగ్లాదేశ్‌లో 2007లో దింజాపూర్ జిల్లా నవాబ్‌గంజ్‌లో పంచ రథాలు ఉన్న శిల్పంతో పాటు, హిందూ దేవాలయం తవ్వకాల్లో బయల్పడింది. ఇక్కడ నాలుగు స్తంభాల మండపం ఉన్నట్లు కనుగొన్నారు. గత 15 సంవత్సరాల్లో తాజాగా జరిపిన తవ్వకాల్లో రెండవ హిందూ దేవాలయం బయల్పడిందని ప్రొఫెసర్ సయ్యద్ మసబ్మద్ కమ్రూల్ అనే పురావస్తు నిపుణులు తెలిపారు. తమ బృందం 9 ప్రదేశాల్లో తవ్వకాలు చేపట్టి వెయ్యికి పైగా ఆర్కియాలజీ సైట్స్‌ను డాక్యుమెంట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఇవన్నీ మధ్య యుగంలో నిర్మించినట్లు అంచనాకు వచ్చినట్లు పురావస్తు నిపుణులు తెలిపారు. ప్రాచీన కాలంలో నదీ తీరాలు, పక్కనే ఉన్న పచ్చటి పొలాలను నివాసంగా చేసుకుని ప్రజలు స్థిరపడేవారు. ఇక్కడ ప్రజలు మతపరమైన కట్టడాలను నిర్మించేవారు. తవ్వకాల్లో బయల్పడిన దేవాలయ నిర్మాణాలను అధ్యయనం చేసేందుకు పురావస్తు నిపుణులు ప్రణాళికను కూడా ఖరారు చేశారు.

-కె.వి.శైలేంద్ర