Others

కథలెప్పుడూ నిత్యనూతనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియమైన పద్మ..
ఉభయకుశోలపరి...
నువ్వు గమనిస్తున్నావా.. ఈ మథ్య పిల్లలెవరూ కథ చెప్పమని అడిగేవారే లేరని నేను మన మహిళామండలిలో చెప్పాను.కాదు కాదు కథలు చదువుతూనే ఉన్నారు. కాకపోతే ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో అంటున్నారు. నిజమే అనేకానేమంది బ్లాగులు క్రియేట్ చేసి చక్కని కథలను ఫోస్టు చేస్తున్నారు. వారంతా వాటిని చదువుతున్నారు.
కథకులకు కాలం ఎప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది. కాకపోతే చదివే తీరు మారుతోంది. కనుక మనం పాఠకులు తగ్గిపోయారని బాధపడనక్కర్లేదు. ఈ మథ్య పేపర్స్ అన్నీ కూడా నెట్ లో వస్తున్నాయి కదా. ఆ నెట్ లోనే కథలు చదువుతున్నారన్నమాట.
నాకు ఇది విన్న తరువాత నిజమే అన్పించింది. అందుకే కథకులు చెప్పే మంచి విషయాలను నెట్ కథల్లో చెప్పేస్తే చాలు నెట్‌జనులు వింటారు. నీవు కూడా మంచి కథకురాలివే కనుక నెట్‌జన్ల్‌కు మంచి కథలు పంపించు...
అంతేకాదు నెట్‌ల్లో చాలా సౌకర్యాలున్నాయ. కథలు రాసేవారే కాక వంటలు చేసేవాళ్లు కూడా తమ తమ వంటలను బ్లాగుల్లో పోస్టు చేస్తున్నారు. వంటలు నేర్చుకోవాలనుకొన్నవారువీటిలో చూసి నేర్చుకోవచ్చు. అంతేకాక ఇపుడు హోటల్‌లో ఆర్డర్స్ ఇవ్వడమోలేక, వంటవాళ్లను పెట్టి వండించడమో చేయకుండా ఈ నెట్ వాళ్లకు మనకు కావాల్సిన వంటల లిస్టును, ఎంతమందికి కావాలో వారిని గురించిన వివరాలు ఇచ్చేస్తే చాలు వారే మన ఇంటికి మనం కోరుకున్నవాటిని చేరుస్తున్నారు. దీనివల్ల అటు చేసేవారికి, ఇటు అందించేవారికి కూడా ఉపాధి దొరుకుతోంది. ఈవెంట్ మేనేజర్స్ లాగా వీరు కూడా పెళ్లిళ్లలకు, చిన్న చిన్న పార్టీలకు వీరు మనకు కావాల్సిన సరుకు పంపిస్తున్నారు. దీని గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తోంది. చాలామందికి ఇటువంటివి ఉన్నాయని తెలిసినా వారిని సంప్రదించే మార్గం తెలియడం లేదు. కనుక వీటి గురించిన సమాచారం కూడా అందరికీ చేరేలా చేయాలి.
-నీ
శర్వాణి