Others

‘టేప్’ టాప్ చిత్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో సృజనాత్మకత, చురుకుదనం పెరగాలంటే చిన్నతనంలోనే పునాది ఉండాలి. చిన్న వయసులో మెదడు అతివేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవటమే కాక, వాటిని రికార్డ్ చేసుకుంటుంది. అయిదు లేక ఆరు సంవత్సరాల లోపుగా పిల్లలు ఎక్కువ విషయాలను గురించి తెలసుకొంటే వారి మేధస్సు అంతగా వికసిస్తుంది. రికార్డ్ అంటే మనకు గుర్తుకొచ్చేది టేప్‌రికార్డ్. అందులో క్యాసెట్ పెట్టి పాటలు వినేవాళ్లం. ఇపుడు ఎంపీ 3 ప్లేయర్ వచ్చాక టేప్ రికార్డర్ వాడకం తగ్గింది దాదాపు అంతరించింది.
అందులో మన మాటలు రికార్డ్ చేసుకొనే టేప్ తో తన సృజనని జోడించి ‘ఇరీస్ ఇమ్మాన్’ ఎన్నో అందమైన చిత్రాలు తీర్చి దిద్దింది. క్రియేటివిటి తోడైతే సరికొత్త అందాలు వినూత్న పరికరాలు ఆవిష్కరించబడుతాయి. వైవిధ్యాలు ఆవిర్భవిస్తాయి. ఎవరైతే సృజనాత్మకతను ప్రదర్శిస్తారో పదిమందిలో ఒకరుగా నిలబడుతారు.
రోల్ మోడల్ అవుతారు. సంధింగ్ డిఫరెంట్‌గా నిలుస్తారు. చక్కటి పెయింటర్‌గా, శిల్పిగా పేరొందినా తన పేరుని ఇంకా చరిత్రలో సుస్థిరం చేసుకొనేందుకు సరికొత్తగ ఆలచించింది.
అంతే!!!!
పాత - ఆడియో టేపులతో వీడియో టేపులతో., సినిమా రీళ్లతో అందమైన రూపాల్ని సృష్టించి వైరుధ్యమైన కళతో భళా భళీ అనిపించుకుంది. మిత్రుల దగ్గర్నుంచి సేకరించిన టేప్స్ తో నవీన భావాలను మేళవించి.. అద్భుతమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టింది.
మైఖేల్ జాక్సన్. జిమీ హెన్ డ్రిక్స్ జాన్ లెనాన్ వంటి సెలబ్రెటిలకు టేపులతో ఆకారమిచ్చింది. మరెందరో ప్రముఖులు ఆమె మ్యూజియంలో ఆమె ప్రతిభకు జోహార్లు అర్పిస్తూ టేపులని చుట్టుకుని నిలిచిపోయారు. సృజన అనేది నిరంతరం అనే్వషణలో లభిస్తుంది. దాంతో మానసికానందం దానికదే మన వద్దకు వచ్చేస్తుంది.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి