Others

అంతటా అమ్మే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీడు నా అంత వాడయ్యాడు’ అన్నాడు నాన్న
‘పిచ్చి వెధవ! ఇంకా వీడికి పసితనం పోలేదు
అమ్మ కొంగుపట్టుకు తిరుగుతున్నాడు
ఎలా బ్రతుకుతాడో ఏమో?’ అంటుంది అమ్మ!
ఉన్నత విద్యా ప్రావీణ్యత ఉన్నా, అత్యున్నత అధికారం సంప్రాప్తించినా,
అమ్మచేతి వంట వంటపట్టిన ఫలితమేగా?
నేనేనా? పాతికేళ్లు అమ్మస్పర్శతో ప్రాపంచిక వాసనలు ఆఘ్రాణించింది!
ఇంకా ఆ అనుభూతుల ప్రపంచం దాటి బైట పడలేనిది!!
‘‘వీడికి వివాహం చేయాలి, ఒక కుటుంబం ఏర్పడాలి!!’’
బాల్య, కౌమార దశలు దాటి యవ్వనంలోకి అడుగుపెట్టానా అప్పుడే!!
ఇనే్నళ్ళు అమ్మే నా నిజజీవితం!
ఏకళ్ళూ నామీద పడకూడదని అంటి పెట్టుకుందిగా ప్రతిక్షణం!
నాయనా! వంశాంకురాన్ని అందించు.
నా బిడ్డ పసితనం సాకే భాగ్యం కలిగించు
అరే! అమ్మకు స్వార్థం అనే పదమే తెలీదుగదా!!
‘బ్రహ్మచర్యంతో ఋషిఋణాన్ని
యజ్ఞ యాగాదులతో దేవ ఋణాన్ని
సంతానాభివృద్ధితో పితృ ఋణాన్ని,
తీర్చటమే గృహస్థాశ్రమ ధర్మం!’
గోత్రాన్ని వంశాన్ని పెంపుచేసుకోవాలి!
కుటుంబ అనుబంధాలు పంచుకోవాలి!! అమ్మ చెపుతోంది.
నా చదువు, విజ్ఞానం, హోదా, ఆడంబరం,
‘‘అమ్మ గంధపు చెట్టు ముందు నేనో మరుగుజ్జు మొక్కను!’’
‘‘నా గమనాగమనాల ఉద్దీపము అమ్మ!
‘కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి’
‘‘లోకంలో చెడ్డవాళ్లయిన పుత్రులు ఉంటారు
కానీ తల్లులు ఎప్పటికి చెడ్డవారు కారు
కదమ్మా?’’
అనంత విశ్వైక ప్రేమకు అమ్మే తార్కాణం!
సకల ప్రాణకోటిలో అమ్మే సాక్షాత్కారం

- బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199