Others

మానవత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వానికి మరో రూపం
దైవానికి ప్రతిరూపం
తన వారి కోసం నిత్యం హారతి కర్పూరమై
కుటుంబానికి వెలుగు దివ్వై
స్వచ్ఛమైన అనురాగామందించే
ఆమె ప్రేమ ఆకాశమంత ఎత్తు
ఏ కల్మషం లేని ఆమె ప్రేమ
సముద్రమంత లోతు
తన బిడ్డల భవిష్యత్తుకోసం
నిత్యం శ్రమించే శ్రామికురాలు
ప్రతిఫలం ఆశించని ప్రేమను పంచి
నిస్వార్థసేవతో పిల్లలను తీర్చిదిద్దే
ఆమె త్యాగం అమూల్యం
అందుకే ఆమె త్యాగమూర్తి
ఎన్ని జన్మలెత్తినా
ఆమె ఋణం తీర్చుకోలేం
ఆమె - ఓ అందమైన అనుభూతి
ఆమె- ఓ అప్యాయత , ఆత్మీయత
ఆమే మాతృమూర్తి
ఆమెకు పాదాభివందనం

--కాయల నాగేంద్ర