Others

కాజు పైనే మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ వంటకానికైనా జీడిపప్పు , బాదం, పిస్తా, వాల్‌నట్‌ల్లాంటివి ఈ మధ్య తప్పనిసరి అవుతున్నాయి. యూట్యూబ్ లు వచ్చి మరీ హోటల్స్‌లో చెఫ్‌లు చేసే వంటకాలన్నీ సులభపద్థతిలో ఇంట్లో చేయడమెలగాలో చూపిస్తున్నాయి. దానితో లింగ భేదం పక్కన పెట్టేసి అందరూ ఆ వంటలను ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే జీడిపప్పుకు డిమాండ్ పెరిగింది.
జీడిపప్పు, వేరుశనగగింజలవంటి నట్స్ శరీరానికి కావలసిన పోషకాలు ఇవ్వడంలో ముందజలో ఉంటాయి. పైగా ఇవి గుండె , మెదడు ఉత్తమంగా పనిచేయడంలో నడుము కొలతలు మారకుండా చూసుకోవడంలో చాలా సహాయం చేస్తాయి. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంస కృత్తులు , విటమిన్ బి1. విటమిన్ బి2 , బి3, బి5, బి6 విటమిన్ సి కాల్షయమ్, ఐరన్, మెగ్నిషియమ్, పొటాషియమ్, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కేవలం రుచికే కాదు జీడిపప్పు మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందచేస్తున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉన్నాయి. జీడిపప్పు తినడానికి స్ర్తిలు ఏమాత్రం బాధపడక్కర్లేదు. ఇందులో కొలెస్ట్రాల్ శాతం అసలే లేదట. గుండె జబ్బులున్నవారు కూడా బేఫికర్‌గా దీన్ని తినొచ్చు. మెగ్నిషియం ఉండడంతో ఎముకలు పుష్టి ఈ పప్పు దోహదపడుతుంది. మన శరీరానికి 300 నుంచి 750 మిల్లిగ్రాముల మెగ్నిషియం అవసరమవుతుంది. కనుక కాజు తీసుకుంటే మేలు.. ప్రకృతిలో జీడిపండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, అది బయటకే కనపడుతుంది. మేలిమి ఆహారంగా పేరొందిన జీడిపప్పు కి 400 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలున్నాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ జీడిపండును 16వ శతాబ్దంలో పోర్చుగీసు నావికులు భారతదేశానికి పరిచయం చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, జపాన్, సింగపూర్, నెదర్లాండ్ భారతలో ఈ జీడిపప్పు పుష్కలంగా లభిస్తుంది.
‘రిబోప్లావిన్, పాంటోథీనిక్ ఆసిడ్, థైయామిన్, నియాసిన్ వంటి విటమిన్స్ కూడా ఈ జీడిపప్పులో ఉన్నాయి. అనిమియా మ రియు పెల్లాగ్రా వంటి వ్యాదులు కలుగకుండా జీడిపప్పు సాయం చేస్తుంది. సోడియం శాతం తక్కువగాను, పోటాషియం నిల్వలు ఎక్కువగా ఉండడంతో రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లు ఈ పప్పులో ఉన్నాయి. చర్మంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా జీడిపప్పు కాపాడుతుంది. మానసిక వ్యాధులను కూడా దూరం చేస్తుంది. రోజుకు 6, 7 జీడిపప్పులను తినవచ్చు. అంటే 10 గ్రాముల మోతాదుకు మించకుండా ఈ జీడిపప్పును తీసుకొన్నట్లు అయితే శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అట్లాకాక ఎక్కువగా తినేస్తే అది కూడా ఏదో ఒక జబ్బుకు దారితీస్తుంది. కనుక అతిగా కాక మితంగా జీడిపప్పును తినడం మంచిది.
ఇక జీడిపప్పులోని కాపర్ అధికమొత్తంలో ఉంటుంది కనుక నెరసిన జుట్టు వారు వీటిని తీసుకొన్నా జట్టు త్వరగా నెరవదు. అనీమియా ఎదుర్కొనడానికి అవసరమైన రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి కూడా జీడిపప్పు సహాయపడుతుంది.

-మైత్రేయ - వైనతేయ