Others

‘చిన్నపదం- పెద్ద తప్పు’ తప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20-05-2018 వెనె్నలలో ‘సూరికుచ్చి బదరీనాథ్’గారు వ్రాసిన ‘తప్పుకాదు ఒప్పే’ వ్యాసం చదివాక ఈ వివరణ యిస్తున్నాను. ‘చిన్నపదం - పెద్ద తప్పు’ అను నా వ్యాసానికి వారు ‘తప్పుకాదు ఒప్పే’ వ్యాస వివరణ యిచ్చారు. వారు ఆ రచన గొప్పగా వ్రాశారు అభినందించి తీరవలసిందే. ఇతిహాసాల గురించి, రామాయణం గురించి, సాహిత్యపరంగా మెచ్చుకోతగ్గ వ్యాసమే.. రెప్ప పాటన్నా, క్షణమన్నా, వెనువెంటనే అన్నా (యమర్జంట్ పదం లా) అర్థం ఒకటే. ‘‘హవర్’’ అనే పదానికి తెలుగులో ‘గంట’ అనే పదాన్ని, ‘మినిట్’ అనే పదానికి తెలుగులో ‘నిమిషం’ అని మేధావులు అర్ధం చెప్పారు. ‘సెకెండ్’ అనే పదానికింతవరకు తెలుగు పదం సృష్టించబడలేదు. ‘బ్లేడ్, రేజర్, బ్రష్, స్పానర్, టార్చ్, స్క్రూడ్రయివర్, రబ్బర్, పెన్సిల్’ అలా లక్షల పదాలకు తెలుగు పదాలు లేక ఆంగ్ల పదాలనే మనం వాడుచున్నాం. వాటిలో ‘సెకండ్’ పదమొకటి. ఏ కవిగాని, రచయిత గాని సెకండ్‌కు క్షణమని సంభోదించలేదు. క్షణానికి సెకండ్‌కు సంబంధమే లేదు. కవి కొసరాజుగారు ఆ ‘నిమిషం’ పదమెందుకు వినియోగించారో మనకు తెలియదు, ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో కూడ మనకు తెలియదు.
ఆ నిమిష పద ప్రయోగం చిన్న పొరపాటో ఏమోగాని అది తప్పని నా వాదన. క్షణమనే పదం సామాన్యులకు తెలియదా? అర్థం చేసుకోలేరా? నవీన యుగ పదం ‘నిమిషం’, ఆ పదాన్ని త్రేతాయుగ రచనలో వాడడం తప్పుకాక ఒప్పెలాఔతుంది? ఉదాహరణకు ‘దేశముదురు- సాహో’ సినిమా పేర్లకే మైన అర్ధముందా? ఆ పదాలు వాడుకలో వున్నాయా? అలా అర్థం-పర్థం లేని పదప్రయోగం తప్పుకాదంటారా? కరెక్ట్ టైం చెప్పమంటే రెండు గంటలా యిరవై నిముషాల నలభై సెకండ్లు అంటారేగాని, నలవై రెప్పపాటు కాలమని ఎవరైనా చెబుతారా? జనానికి అర్ధంకాని పదాన్ని వాడాలని ఎక్కడుంది? అంటూ వ్రాశారు. దేశముదురు- సాహో పదాలు అర్ధమయ్యేవా? అలాంటపుడు నిముషం అనే పదం బదులు క్షణం అనే పదం వాడకూడదా? ఆ పదానికి అర్ధం లేదా? నోరు తిరిగే పదం కాదా? ‘సెకండ్’ పదానికి ‘రెప్పపాటు కాలం’ అంటూ అర్ధం చెప్పారు. సెల్‌ఫోన్ పట్టుకు తిరిగే నేటి యువత నడగండి సెకెండ్ కర్థం చెబుతారేమో? ఒక్కరైన రెప్పపాటు కాలమని చెబుతారా చూడండి. 60 రెప్పపాటు కాలాలు నిముషమని ఏ కవి, రచయిత ఎక్కడ వ్రాయలేదు, చెప్పలేదు, వినియోగించలేదు. అది తప్పుగాక ఒప్పెలా ఔతుంది. 60 సెకండ్లు ఓ నిముషం, 60 నిముషాలు ఓ గంటగా కాలం కొలుస్తున్నాం. టైం ఎంత అంటే పది గంటల పది నిముషాలని చెబుతారు అడిగిన వెంటనే. సెకన్ల గురించి ఎవరం అడగం, ఎవరూ చెప్పరు. క్షణమనే పదం అసలే వాడం. త్వరగా రారా అంటే ఇదిగో క్షణంలో వస్తా అను జవాబు వస్తుందే తప్ప, క్షణమనే పద వినియోగమెక్కడుంది? ఏది ఏమైనా నవీన యుగపదం త్రేతాయుగ రచనలో వినియోగించడం ముమ్మాటికి తప్పే. అలా నిమిష పద వినియోగం గురించి సాహిత్యపరంగా యితిహాసాలు, పురాణాలు లోతుగా ఆలోచించినా తప్పుగానే గోచరిస్తుంది.
సెకండ్‌ను క్షణం అనుకునే వారు సైతం వున్నారు, కాదనలేం, ఎవరి అభిప్రాయాలు వారివి. ‘‘శుభ, కాకినాడ’’వారు 20-5-18 వెనె్నల మీ వ్యూస్‌లో ‘మినిట్‌ను నిమిషం అనడమే తప్పని’ వ్రాశారు. మరి మినిట్‌ను ఏమంటారో వారు తెలిపి వుంటే అందరం తెలిసికునే వారం. తప్పన్నప్పుడు ఏది ఒప్పో చెప్పాలిగా మరి. అలా చెప్పలేనపుడు, వివరించలేనపుడు వూరికే తప్పంటె, సరిపోతుందా? ఇంతటితో నా వివరణ ముగిస్తున్నాను. ‘చిన్నపదం- పెద్ద తప్పు’ తప్పే!

-మురహరి ఆనందరావు