Others

నాకు నచ్చిన పాట--నా జన్మ భూమి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా జన్మ భూమి
ఎంత అందమైన దేశము’
ఈ పాటకు కాలపరిమితి లేదు. అనంతమైన నగ్న సత్యాలను అపరిమితమైన పాటగా పోతపోసారు రచయిత ఆరుద్ర. సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్, గాయకుడు ఘంటసాల.. సంగీతం, గానం మేళవింపుగా ప్రతి దేశ పౌరుడి గుండెకు హత్తుకుపోయేలా తీర్చిదిద్దారు. మరచిపోని, మరువరాని మధురగీతం.
‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము/ నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము..
నడిచే దారిలో నవ్వేపువ్వులు/ శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
ఎగిరే పిట్టలు, పచ్చని పంటలు, వెచ్చని జంటలు, చల్లని జీవితం ఇదే నవ భారతం హాయ్ హాయ్... నా సామిరంగా’ అంటూ హావభావాలతో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు అక్కినేని నాగేశ్వరరావు. ప్రతి సిపాయిలో పౌరుషం చూపిన దేశసైనికుడిగా ఆదర్శ నటనకు పరాకాష్ఠ అనిపిస్తుంది ‘సిపాయి చిన్నయ్య’ చలన చిత్రంలో దృశ్యం. ‘బతకాలందరు దేశంకోసమే/ దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే ఆహాహా.. ఆహాహా.., స్వార్ధము వంచన లేనిదే పుణ్యము/ త్యాగము రాగము, మిళితమే ధన్యము’. భారతీయ ప్రజలను నిదురనుండి లేపుతున్న ప్రబోధ దేశభక్తి గీతం. ఈ పాటలోని ప్రతి పదం అద్భుతం, ఒక మేలుకొలుపు. చిరకాలం వుండే ఈ గీతం నాకిష్టం.
***

వెనె్నల రచయితలకు
సూచన
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

-జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం