Others

మహిళలూ..మేల్కోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంటి బిడ్డ కంటే
సక్కంగా కనిపెట్టుకుంటూ
ఉండాలంటారు
వయోవృద్ధులను..

కానీ... నేడు వయోవృద్ధులపై
ఎన్నో దాడులు..
పిడికెడు మెతుకులు
పెట్టవలసి వస్తుందని
పీక పిసుకుతున్నారు
పిసినారోళ్లు..

అత్తమామలంటే ఎందుకో
అంతకోపం..?
ఆసరా లేకనే నీ పంచనున్నారనా..
వాళ్లను అంత హీనంగా చూడకు
వాళ్లే లేకుంటే..
ఎక్కటిది నీ కుటుంబం?
కనిపెంచిన కొడుకును
నీవు కొంగుకు కట్టుకుని
కన్న తల్లిదండ్రులను
కానివారిగా చూస్తున్నావు..
అత్తా ఒకప్పటి కోడలన్నారు నాడు
కోడలు కూడా ఒక రోజు
అత్తగారి అవతారమెత్తాలి కదా!
అప్పుడేంటి నీ పరిస్థితి అని
ఒక్కసారి ఆలోచించండి!
మహిళలూ మేల్కోండి..
మనం మనుషులమని మరవకండి..
మానవత్వాన్ని చాటండి!

-ఉషశ్రీ తాల్క