Others

చర్మసంరక్షణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటి దాకా వేసవి ప్రతాపంతో అల్లాడిపోయిన వారికి ఇపుడు వానాకాలం రావడంతో చెప్పలేని ఆనందం.. ఆహ్లాదకరమైన జల్లుల వాతావరణాన్ని ఆస్వాదించని వారు ఎవరు..? అయితే- ఇంతటి ఆనందకర వాతావరణం చర్మసంబంధ సమస్యలను, అనేక అనారోగ్యాలను కూడా తెచ్చిపెడుతుంది. వానలు కురిసే సమయంలో నీటి కాలుష్యం, అపరిశుభ్ర వాతావారణం, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. వాతావరణంలో తేమ పెరగడంతో చర్మ, శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఇంటిపనులతో తలమునకలయ్యే గృహిణులు, ఇంటాబయటా ఒత్తిడితో పనిచేసే ఉద్యోగినులు చర్మ సంరక్షణ పట్ల ఇపుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు వ్యాధుల బారిన పడడమే కాకుండా, శారీరక సౌందర్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వానాకాలంలో ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు అవసరం. చర్మసంరక్షణ పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ప్రస్తుత సీజన్‌లో తేమ వాతావరణం, దుమ్ము, ధూళి కారణంగా చర్మం కాంతివిహీనమవుతుంది. చర్మ సంబంధ సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఇంట్లోనే కొన్ని పద్ధతులను, చిట్కాలను పాటించాలి.
* ముఖచర్మం మంచి నిగారింపుతో,మృదువుగా ఉండాలంటే ఉదయం, సాయంత్రం వీలైనన్ని ఎక్కువ సార్లు చన్నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై జిడ్డుదనం పోతుంది.
* నాణ్యమైన ‘టోనర్ల’ను ముఖానికి వాడినపుడు బాక్టీరియా, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.
* ముఖచర్మానికి అనువైన ‘ఫేస్ ప్యాక్’ను వారానికోసారి వేసుకుంటే మంచి నిగారింపు వస్తుంది. ఇలా చేస్తే ముఖంపై మృతకణాలు తొలగిపోతాయి.
* నాణ్యమైన లోషన్లు, మాయిశ్చరైజర్లను వాడితే ముఖచర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. వైద్య నిపుణుల సలహా మేరకు క్రీమ్‌లు, లోషన్లు వాడడం ఉత్తమం.
* ఎండవేళ బయటకు వెళ్లినపుడు సూర్యకిరణాల ప్రభావం కళ్లపై, ముఖంపై పడకుండా కళ్లజోడు, స్కార్ఫ్‌లు వంటివి వాడాలి.
* వానాకాలంలో ముఖానికి మితిమీరి మేకప్ చేసుకోవడం తగ్గించాలి. ఒకవేళ మేకప్ వేసుకున్నా సులువుగా, నీటితో కడిగితే తొలగిపోయేలా జాగ్రత్తపడాలి.
* బ్లీచింగ్, ఫేషియల్స్‌కు వానాకాలం అనుకూలం కాదు. వీటి వల్ల ముఖచర్మానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది.

--టి.ప్రణతి