Others

చట్టానికి కళ్లు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాలకు చెవులు మాత్రమే ఉంటాయని, కళ్లుండవని, సాక్ష్యం, ఆధారం లేకుండా ఏ నేరం చేసినా చెల్లుబాటు అవుతుందని అలా జరగకూడదని చెప్పే చిత్రమే ‘చట్టానికి కళ్లు లేవు’. సుమారు మూడు దశాబ్దాల కిందట విడుదల అయినా ఇప్పటికీ, ఎప్పటికీ ఈ నీతి మారదనే సత్యాన్ని చెప్పినదీ చిత్రం. సిలోన్ మనోహర్, కన్నడ ప్రభాకర్‌లు ఇందులో ప్రధాన విలన్లు. కాగా తెలుగువాడైన అల్లు రామలింగయ్య సహాయ విలన్. తన తోటివారిని పోగొట్టుకున్న చిరంజీవి అదే అస్త్రాన్ని ఉపయోగించి దుష్టులపై ఎలా పగ తీర్చుకొన్నాడనేది కథాంశం! అక్క పోలీసు అధికారిగా లక్ష్మీ నటించింది. తమ్ముణ్ణి చట్టానికి పట్టి ఇవ్వాలనే ఆమె ప్రయత్నాలను ఏ విధంగా విజయవంతంగా తమ్ముడు (చిరంజీవి) విఫలం చేశాడో ఈ కథ అద్భుతంగా వివరిస్తుంది. ముఖ్యంగా తమ్ముణ్ణి బుట్టలో వెయ్యాలని ఇంత తెలివిగా ఎలా చేయగలిగావురా అని పొగుడుతుంది. పొగడ్తలకు లొంగి నిజం చెప్తాడని, అతణ్ణి బందీ చేయవచ్చని టేప్ రికార్డర్ ఉంచుతుంది. తమ్ముడు ఈ విషయం తెలుసుకొని కొంత ఉపోద్ఘాతం అయిన తర్వాత టేప్ కట్ చేస్తాడు! ఈ సంగతి అక్కకు తెలియదు. పాపం, పై అధికారుల దగ్గరకు వెళ్లి అసలు నేరస్థుడి వాఙ్మలం సేకరించానని చెబుతుంది. ఏది వినిపించమని వాళ్లు అడుగుతారు. టేప్ ఆన్ చేస్తుంది. కొంతవరకు అసలు విషయం ఉపోద్ఘాతం వినపడుతుంది. తర్వాత ‘అనుకొన్నదొక్కటి, అయినది ఇంకొక్కటి, బోల్తాకొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అని వినిపిస్తుంది. ఎన్నిసార్లు ఆన్ చేసినా అదే వినబడుతుంది. పై అధికారులతో చీవాట్లు తినవలసివస్తుంది. ఈ విధంగా దుర్మార్గుల ఆటలను తెలివిగా కట్టించిన చిరంజీవి నటన ప్రశంసార్హం! దీని తర్వాత ఇలాంటి పేరుతో ‘చట్టానికి వేయికళ్లు’ అనే మరో మూవీ వచ్చింది. ఇవేవి చట్టానికి కళ్లు లేవు లాగా ఎక్కువ కాలం ప్రదర్శనకు నోచుకోలేదు. ముఖ్యంగా అల్లు రామలింగయ్యకు కళ్లద్దాలు లేకపోతే చూపు ఉండదని గ్రహించిన చిరంజీవి గన్ పాయింట్‌లో అద్దాలు తీయించి వెళ్లమంటారు. కార్లు ఇటునుంచి అటునుంచి వస్తూ పోతుంటాయి. వాటి కిందపడి నలిగి చచ్చిపోతాడు. చిరంజీవి తన పగ తీర్చుకొంటాడు. సాధారణ ప్రజలు, పోలీసులు ఇది ప్రమాద మరణమేనని నిర్థారిస్తారు. అప్పట్లో అన్ని ఆటలు హౌస్‌ఫుల్ అయిన ఈ చిత్రాన్ని మెచ్చుకోనివారు ఉండరు.

--కాకుటూరి సుబ్రహ్మణ్యం