Others

రియల్ హీరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునే వారున్న ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో అయి ఉండి ఎలాంటి సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా బాధికులకు సహాయం చేసి వారి మనసులను దోచుకుని.. ఆయన రీల్ హీరోనే కాదు.. రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే తమ ఆరోగ్యాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తోదంటూ ఇటీవలే తమిళనాడులోని తూత్తుకుడి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం జరిపిన విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ప్రజలపై పోలీసులు అమానుషంగా కాల్పులు జరపడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించి ఈ సంఘటనతో పలువురు ప్రముఖులు చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారు. అయితే వారంతా బాధితుల చేతిలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. చివరకు సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా వారి నుండి చేదు అనుభవాన్ని ఎదుర్కోవడం విశేషం. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ నిన్న రాత్రి ఒంటరిగా బైక్‌పై వచ్చి బాధితుల కుటుంబాలని పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పారితోషికం అందించారు. ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఇలా బాధితులను పరామర్శించడం అందర్నీ ఆలోచింపజేసింది.